Abn logo
Sep 21 2021 @ 23:39PM

మార్కెట్‌ యార్డులో అంతర్గత అభివృద్ధికి పెద్దపీట

మొక్కలు నాటుతున్న యార్డు చైర్మన్‌ వెంకటరమణ, వైస్‌ చైర్మన్‌, తదితరులు

 తాడేపల్లిగూడెం, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యో తి) : తాడేపల్లిగూడెం మార్కెట్‌ యార్డులో అంత ర్గత అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించా మని ఏఎంసీ చైర్మన్‌ గుండుబోగుల వెంకటర మణ తెలిపారు.  ఏఎంసీ పాలకవర్గ సమావే శం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యార్డులో ఉన్న ఐదు వేల టన్నుల సామర్థ్యం ఉన్న గోదాములను సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌కు అద్దెకు ఇచ్చామని, దానికోసం వేబ్రిడ్జి  ఏర్పాటు, యార్డులో వున్న 36 షాపులను పునరుద్ధరించేందుకు చర్యలు, శిథిలావస్థకు చేరు కున్న సీసీ రహదారులపై కొత్త రహదారులు వేసేందుకు నిర్ణయించామ న్నారు. ప్రతి మంగళవారం పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టి పచ్చదనం పెంచేందుకు కొబ్బరి మొక్కలను నాటుతున్నట్టు తెలిపారు. వైస్‌ చైర్మన్‌ జామికృష్ణ, సభ్యులు మండా పద్మ, కోడే శ్రీను, మహ్మద్‌ షఫీ పాల్గొన్నారు.