మార్కెట్‌ మళ్లీ కుదేల్‌..

ABN , First Publish Date - 2022-01-20T06:18:16+05:30 IST

అంతర్జాతీయ ప్రతికూలతల కారణంగా భారత ప్రామాణిక ఈక్విటీ సూచీలు వరుసగా రెండో రోజూ భారీ నష్టాలను చవిచూశాయి.

మార్కెట్‌ మళ్లీ కుదేల్‌..

రెండ్రోజుల్లో రూ.5.24 లక్షల కోట్లు ఆవిరి  

ముంబై: అంతర్జాతీయ ప్రతికూలతల కారణంగా భారత ప్రామాణిక ఈక్విటీ సూచీలు వరుసగా రెండో రోజూ భారీ నష్టాలను చవిచూశాయి. బుధవారం బీఎ స్‌ఈ సెన్సెక్స్‌ ఒకదశలో 60,000 దిగువకు పతనమైంది. చివరికి 656.04 పాయింట్ల నష్టంతో 60,098.82 వద్ద స్థిరపడింది. ఈ నెల 7 తర్వాత సూచీకిది కనిష్ఠ ముగింపు స్థాయి. ఎన్‌ఎ్‌సఈ నిఫ్టీ 18,000 కీలక స్థాయిని కోల్పోయింది. 174.65 పాయింట్లు క్షీణించి 17,938.40 వద్దకు జారుకుంది. ఫెడ్‌ రేట్ల పెంపు,  ధరలపోటు భయాలతో అమెరికాలో బాం డ్ల రేట్లు రెండేళ్ల గరిష్ఠానికి ఎగబాకడంతో పాటు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు ధరలు సరికొత్త ఏడేళ్ల గరిష్ఠానికి చేరుకోవడం, కొవిడ్‌ కేసుల ఉధృతి వంటి అంశాలు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లపై ఒత్తిడి పెంచాయి. గ్లోబల్‌ ట్రేడింగ్‌ ట్రెండ్‌కు అనుగుణంగా మన మార్కె ట్లూ  నష్టాల బాట పట్టాయి. వచ్చే నెల ఒకటిన ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో దేశీయ మదుపర్లు ముందు జాగ్రత్తగా వ్యవహరిస్తుండటంతో పాటు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల అమ్మకాలు దేశీయ సూచీలను మరింత కుంగదీశాయి. మంగళవారం నాటి ట్రేడింగ్‌లోనూ సెన్సెక్స్‌ 554, నిఫ్టీ 195 పాయింట్లు పతనమయ్యాయి. రెండ్రోజుల అమ్మకాల హోరులో రూ.5.24 లక్షల కోట్లకు పైగా స్టాక్‌ మార్కెట్‌ సంపద హరించుకుపోయింది. దాంతో బీఎ స్‌ఈ లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.274.77 లక్షల కోట్లకు పడిపోయింది. సెన్సెక్స్‌లోని 30 లిస్టెడ్‌ కంపెనీల్లో 22 నష్టాల్లో ముగిశాయి. 


డెరివేటివ్‌ ట్రేడింగ్‌లో ఎన్‌ఎ్‌సఈ ప్రపంచ నం.1

నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (ఎన్‌ఎ్‌సఈ) వరుసగా మూడో ఏడాదీ ప్రపంచంలో అతిపెద్ద డెరివేటివ్‌ ఎక్స్ఛేంజ్‌గా నిలిచింది. గత ఏడాది కూడా అత్యధిక డెరివేటివ్‌ కాంట్రాక్టులు ఎన్‌ఎ్‌సఈలోనే ట్రేడైనట్లు ఫ్యూచర్స్‌ ఇండస్ట్రీ అసోసియేషన్‌ (ఎ్‌ఫఐఏ) తెలిపింది. అంతేకాదు, వరల్డ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఎక్స్ఛేంజె్‌స (డబ్ల్యూఎ్‌ఫఈ) గణాంకాల ప్రకారం.. గత ఏడాది క్యాష్‌ ఈక్విటీ ట్రేడింగ్‌ పరంగా ఎన్‌ఎ్‌సఈ ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఎక్స్ఛేంజ్‌గా నిలిచింది. 


ఈక్విటీ మదుపర్ల కోసం సెబీ మొబైల్‌ యాప్‌ 

సెక్యూరిటీ మార్కెట్‌పై మదుపర్లకు అవగాహన కల్పించేందుకు ‘సాథీ’ పేరుతో మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీ మొబైల్‌ యాప్‌ను ప్రవేశపెట్టింది. ఈ మొబైల్‌ యాప్‌ మదుపర్ల సాధికారత పెంచే దిశగా చేపట్టిన మరో ప్రయత్నమని సెబీ చైర్మన్‌ అజయ్‌ త్యాగి ఈ సందర్భంగా పేర్కొన్నారు. కరోనా సంక్షోభం మొదలయ్యాక ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టడం లేదా ట్రేడింగ్‌ చేసే వారి సంఖ్య అనూహ్యంగా పెరిగింది. చాలా మంది మొబైల్‌ ద్వారా ట్రేడింగ్‌ చేస్తున్నారని, అలాంటి వారు అవసరమైన సమాచారాన్ని మొబైల్‌ యాప్‌ ద్వారా పొందే వీలుంటుందని అన్నారు. 

Updated Date - 2022-01-20T06:18:16+05:30 IST