ఫలితాలు, వ్యాక్సినేషన్‌తోనే దిశ!

ABN , First Publish Date - 2021-05-17T06:58:05+05:30 IST

ఈ వారం మార్కెట్ల గమనం వ్యాక్సిన్‌ పంపిణీ, త్రైమాసిక ఆర్థిక ఫలితాలు, గ్లోబల్‌ ట్రెండ్‌పై ఆధారపడి ఉండనుంది. ఎలాంటి ధోరణిని కనబరచకుండా అనిశ్చిత ధోరణిలో మార్కెట్లు సాగుతున్నాయి...

ఫలితాలు, వ్యాక్సినేషన్‌తోనే దిశ!

ఈ వారం మార్కెట్ల గమనం వ్యాక్సిన్‌ పంపిణీ, త్రైమాసిక ఆర్థిక ఫలితాలు, గ్లోబల్‌ ట్రెండ్‌పై ఆధారపడి ఉండనుంది. ఎలాంటి ధోరణిని కనబరచకుండా అనిశ్చిత ధోరణిలో మార్కెట్లు సాగుతున్నాయి. ఈ వారం ప్రథమార్ధం దాదాపు ఆటుపోట్లలోనే సాగే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఒకవేళ అప్‌ట్రెండ్‌ను సూచిస్తే 14,750-14830 మధ్య నిరోధ స్థాయిలుంటాయి. డౌన్‌ట్రెండ్‌ను కనబరిస్తే 14540,14400 వద్ద మద్దతు స్థాయిలుంటాయి. ట్రేడర్లు స్టాక్‌ ఆధారిత విధానాన్ని అనుసరించటం మంచిది.


స్టాక్‌ రికమండేషన్స్‌

ఐటీసీ: గత వారం అనూహ్యంగా షేరు ధరతో పాటు వాల్యూమ్స్‌ పెరిగాయి. ఈ వారం కూడా జోరు కొనసాగే అవకాశం ఉంది. గత శుక్రవారం రూ.212.25 వద్ద క్లోజైన ఈ షేరు.. రానున్న రోజుల్లో రూ.209-207 స్థాయిలకు పడినప్పుడు రూ.222 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.202 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలి. 


లాల్‌ పాథ్‌లాబ్‌

డైలీ చార్టుల ప్రకారం చూస్తే లోయర్‌ టాప్‌.. లోయర్‌ బాటమ్‌తో స్వల్పకాలిక బలహీనతను సూచిస్తోంది. ఇటీవలి గరిష్ఠ స్థాయిల నుంచి ఈ షేరు పతనమవుతూ బలమైన మద్దతు జోన్‌ కోసం చూస్తోంది. గత శుక్రవారం రూ.2719.45 వద్ద క్లోజైన ఈ షేరు మరింత పతనమైతే అమ్ముకోవటం మంచిది. రానున్న రోజుల్లో రూ.2,600 స్థాయిని టార్గెట్‌గా పెట్టుకుని విక్రయించే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.2,792 స్థాయిని కచ్చితమైన  స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి. 

           - సమీత్‌ చవాన్‌, చీఫ్‌ ఎనలి్‌స్ట,

     టెక్నికల్‌, డెరివేటివ్స్‌, ఏంజెల్‌ బ్రోకింగ్‌


నోట్‌:  పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.


Updated Date - 2021-05-17T06:58:05+05:30 IST