మార్కెట్‌ నిర్మాణ పనులు నిలిపివేయాలి

ABN , First Publish Date - 2022-09-26T06:12:08+05:30 IST

ప ట్టణంలోని ఎన్నెస్పీ క్యాం పులో తమ పూర్వీకుల నుంచి వారసత్వంగా ల భించిన భూమిలో చేపట్టి న సమీకృత మార్కెట్‌ ని ర్మాణ పనులు నిలిపివేయాలని మహ్మద్‌ అబ్దుల్‌గౌస్‌ కుటుంబసభ్యులు డి మాండ్‌ చేశారు.

మార్కెట్‌ నిర్మాణ పనులు నిలిపివేయాలి
నిర్మాణ స్థలంలో నిరసన వ్యక్తం చేస్తున్న బాధితులు

మిర్యాలగూడఅర్బన, సెప్టెంబరు 25:  ప ట్టణంలోని ఎన్నెస్పీ క్యాం పులో తమ పూర్వీకుల నుంచి వారసత్వంగా ల భించిన భూమిలో చేపట్టి న సమీకృత మార్కెట్‌ ని ర్మాణ పనులు నిలిపివేయాలని మహ్మద్‌ అబ్దుల్‌గౌస్‌ కుటుంబసభ్యులు డి మాండ్‌ చేశారు. ఆదివారం వారు నిర్మాణ స్థలంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబసభ్యులు మాట్లాడుతూ ఎన్నెస్పీ క్యాంపు సర్వే నెం బర్‌  872/2లో సుమారు 6.17ఎకరాల భూమి తమకు వారసత్వంగా వచ్చిందని తెలిపారు. తమ కుటుంబానికి చెందిన భూమిని మునిసిపల్‌ అధికారులు సమీకృత మార్కెట్‌ నిర్మాణం కోసం కేటాయించడం అన్యాయమన్నారు. దీనిపై తమ వారసులమంతా హైకోర్టుకు వెళ్లి ఈ నెల 19వ తేదీన స్టే ఆర్డర్‌ తీసుకువచ్చినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భూమి హద్దుల వివాదం కోర్టులో ఉన్నందున తుది తీర్పు వచ్చేంత వరకు తమ స్థలం లో ఎలాంటి నిర్మాణ పనులు చేపట్టవద్దని బాధితులు అధికారులను కోరారు. రె వెన్యూ, మునిసిపల్‌ అధికారులను సర్వే ద్వారా ఎన్నెస్పీ భూములను గుర్తించి ఆ స్థలంలో సమీకృత మార్కెట్‌ నిర్మాణ పనులు మొదలు పెట్టుకోవాలన్నారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం నిర్మాణ పనులు నిలిపివేసి భూ సర్వే ద్వారా తమ కు న్యాయం చేయాలని బాధితులు అధికారులను కోరారు.


Updated Date - 2022-09-26T06:12:08+05:30 IST