మార్కెట్‌ చైర్మన్‌ ఎంపికపై ఉత్కంఠ

ABN , First Publish Date - 2022-08-20T04:55:46+05:30 IST

అందోలు నియోజకవర్గ కేంద్రంలోని జోగిపేట మార్కెట్‌, వట్‌పల్లి మార్కెట్‌ కమిటీల ఎన్నికపై ఆసక్తి నెలకొన్నది. ఈ రెండు మార్కెట్ల పాలకవర్గాల పదవీకాలం ఇటీవలే ముగిసింది. దీంతో పలువురు అధికార పార్టీ నాయకులు పదవులపై కన్నేశారు. నియోకవర్గ కేంద్రమైన జోగిపేట మార్కెట్‌ను నాలుగు దశాబ్దాల క్రితం ఏర్పాటు చేశారు. వట్‌పల్లి మార్కెట్‌ కమిటీని పదేళ్లు క్రితం ఏర్పాటు చేశారు. ఈసారి జోగిపేట మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవి ఎస్సీ జనరల్‌కు, వట్‌పల్లి మార్కెట్‌ కమిటీ ఓసీ మహిళలకు రిజర్వు చేశారు.

మార్కెట్‌ చైర్మన్‌ ఎంపికపై ఉత్కంఠ

త్వరలోనే జోగిపేట, వట్‌పల్లి మార్కెట్లకు నూతన పాలవర్గాలు!

ఎస్సీ జనరల్‌కు జోగిపేట, జనరల్‌ మహిళ కు వట్‌పల్లి రిజర్వు


జోగిపేట, ఆగస్టు 19: అందోలు నియోజకవర్గ కేంద్రంలోని జోగిపేట మార్కెట్‌, వట్‌పల్లి మార్కెట్‌  కమిటీల ఎన్నికపై ఆసక్తి నెలకొన్నది. ఈ రెండు మార్కెట్ల పాలకవర్గాల పదవీకాలం ఇటీవలే ముగిసింది. దీంతో పలువురు అధికార పార్టీ నాయకులు పదవులపై కన్నేశారు. నియోకవర్గ కేంద్రమైన జోగిపేట మార్కెట్‌ను నాలుగు దశాబ్దాల క్రితం ఏర్పాటు చేశారు. వట్‌పల్లి మార్కెట్‌ కమిటీని పదేళ్లు క్రితం ఏర్పాటు చేశారు. ఈసారి జోగిపేట మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవి ఎస్సీ జనరల్‌కు, వట్‌పల్లి మార్కెట్‌ కమిటీ ఓసీ మహిళలకు రిజర్వు చేశారు. 


జోగిపేట మార్కెట్‌ చైర్మన్‌గిరిపై పలువురి ఆశలు

నియోకవర్గంలోనే పెద్దదైన జోగిపేట మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవిపై పలువురు నేతలు ఆశలు పెట్టుకున్నారు. వీరిలో పుల్కల్‌ మండలానికి చెందిన పల్లె సంజీవయ్య (గొంగ్లూర్‌), మన్నె మధుసూదన్‌ (సింగూర్‌), చౌటకూరు మండలానికి చెందిన నాగులపల్లి శ్రీహరి (కోర్పోల్‌), అందోలు మండల నాయకులు పులుగు గోపాల్‌రావు (జోగిపేట), ఆరిటిక్యాల శంకరయ్య (డాకూరు) పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. పల్లె సంజీవయ్య భార్య పల్లె సరోజ శివంపేట పీఏసీఎస్‌ చైర్‌పర్సన్‌గా, డీసీసీబీ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. జోగిపేటకు చెందిన టీఎన్‌జీవో నేత, టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జిగా 11 ఏళ్లు సేవలంలదించిన దివంగత పులుగు  కిష్టయ్య తనయుడు గోపాల్‌రావు కూడా ఏఎంసీ చైర్మన్‌ పదవిని ఆశిస్తున్నారు. గతంలో ఆయన అందోలు-జోగిపేట మున్సిపల్‌ కౌన్సిలర్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఆయన తల్లి మున్సిపల్‌ కౌన్సిల్‌లో సభ్యురాలు. ఆరిటిక్యాల శంకరయ్య ప్రస్తుతం పీఏసీఎస్‌ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. ఉమ్మడి పుల్కల్‌ మండలానికి చెందిన మన్నె మధసూదన్‌,  నాగులపల్లి శ్రీహరి తెదేపా నుంచి టీఆర్‌ఎ్‌సలో చేరి, రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్నారు. అలాగే, పుల్కల్‌ మండలానికి చెందిన ఓ ఉపాధ్యాయుడి సతీమణి పేరుకూడా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తున్నది.


వట్‌పల్లి చైర్మన్‌.. ఆ ఇద్దరూ వద్దన్నారు

వట్‌పల్లి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవికి ఎమ్మెల్యే ఇద్దరి వైపు మొగ్గుచూపుతున్నా.. ఆ ఇద్దరూ ఆసక్తి చూపడం లేదు. జనరల్‌ మహిళకు కేటాయించబడిన వట్‌పల్లి ఏఎంసీ చైర్‌పర్సన్‌గా టీఆర్‌ఎస్‌ అల్లాదుర్గం మండల మాజీ అధ్యక్షుడు, ముప్పారం గ్రామానికి చెందిన సుభా్‌షరావు దేశ్‌పాండే సతీమణి అనూరాధను ఎంపిక చేయాలని ఎమ్మెల్యే భావించారు. కానీ స్థానిక సంస్థల ఎన్నికలనాటి నుంచి ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్న సుభా్‌షరావు భార్యకు పదవిని తీసుకోవడానికి సుభా్‌షరావు నిరాకరించినట్టు సమాచారం. వట్‌పల్లి మండలం నిర్జప్లకు చెందిన ‘వరం’ అధ్యక్షుడు మర్‌పల్లి వీరారెడ్డి భార్య నందినిరెడ్డిని ఎంపిక చేస్తారని ప్రచారం జరిగింది. సర్పంచ్‌ పదవికి రాజీనామా చేయాల్సి ఉండడంతో ఆమె కూడా ఆసక్తి చూపనట్టు తెలుస్తున్నది.

Updated Date - 2022-08-20T04:55:46+05:30 IST