బ్యాంకింగ్‌తోనే ర్యాలీ !

ABN , First Publish Date - 2020-06-01T06:05:37+05:30 IST

బ్యాంకింగ్‌ విభాగంలో జోష్‌ కనిపిస్తేనే మార్కెట్‌ ర్యాలీని కనబరిచే అవకాశం ఉంది. గత వారం ర్యాలీ కొనసాగాలంటే బ్యాంకింగ్‌ దిగ్గజాలు తమ జోరును చూపించాల్సి ఉంటుంది. నిఫ్టీ 9500 ఎగువన నిలదొక్కుకుంటేనే బుల్లిష్‌ ధోరణిని...

బ్యాంకింగ్‌తోనే ర్యాలీ !

బ్యాంకింగ్‌ విభాగంలో జోష్‌ కనిపిస్తేనే మార్కెట్‌ ర్యాలీని కనబరిచే అవకాశం ఉంది. గత వారం ర్యాలీ కొనసాగాలంటే బ్యాంకింగ్‌ దిగ్గజాలు తమ జోరును చూపించాల్సి ఉంటుంది. నిఫ్టీ 9500 ఎగువన నిలదొక్కుకుంటేనే బుల్లిష్‌ ధోరణిని కనబరుస్తుంది. ఈ వారం నిఫ్టీ 9532-9731 స్థాయిల మధ్య గట్టి పరీక్షను ఎదుర్కొనే అవకాశాలున్నాయి. ఒకవేళ నిలదొక్కుకోలేకపోతే 9450, 9380 మద్దతు స్థాయిలుగా ఉంటాయి.  


స్టాక్‌ రికమండేషన్స్‌

వినతి ఆర్గానిక్స్‌: గత కొంతకాలంగా అప్‌ట్రెండ్‌లో సాగుతూ రూ.700 స్థాయి నుంచి బలమైన రికవరీని సాధించింది. గత శుక్రవారం ఈ షేరు రూ.1,016.60 వద్ద క్లోజైంది. రానున్న రోజు ల్లో ఈ షేరు టార్గెట్‌ ధర రూ.1,095. రూ.976 స్టాప్‌లా్‌సతో కొనుగోలు చేయవచ్చు. 


కజారియా సిరామిక్స్‌: గడచిన నాలుగు నెల ల్లో 50 శాతానికి పైగా పతనమైన ఈ కంపెనీ షేరుకు గతవారం బలమైన మద్దతు లభించటం తో ఒక్కసారిగా బుల్లి్‌షగా మారింది. గత శుక్రవారం ఈ షేరు రూ.342 వద్ద క్లోజైంది.  రానున్న వారాల్లో ఈ షేరును రూ.316 స్టాప్‌లాస్‌తో రూ.378 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. 

- సమీత్‌ చవాన్‌, చీఫ్‌ అనలిస్ట్‌ టెక్నికల్‌, డెరివేటివ్స్‌, ఏంజెల్‌ బ్రోకింగ్‌


నోట్‌:పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.


Updated Date - 2020-06-01T06:05:37+05:30 IST