దూకుడు వద్దు

ABN , First Publish Date - 2021-05-10T06:54:21+05:30 IST

కీలక సూచీలు లాభాలతో ముగుస్తున్నా గత కొద్ది రోజులుగా మార్కెట్‌ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. నిఫ్టీ, బ్యాంక్‌ నిఫ్టీ, నిఫ్టీ ఐటీ సూచీలు ఒక నిర్ణీత పరిదిలోనే కొట్టుమిట్టాడుతున్నాయి..

దూకుడు వద్దు

కీలక సూచీలు లాభాలతో ముగుస్తున్నా గత కొద్ది రోజులుగా మార్కెట్‌ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. నిఫ్టీ, బ్యాంక్‌ నిఫ్టీ, నిఫ్టీ ఐటీ సూచీలు ఒక నిర్ణీత పరిదిలోనే కొట్టుమిట్టాడుతున్నాయి. గత వారం 14,823.15 వద్ద ముగిసిన నిఫ్టీకి ఈ వారం గరిష్ఠంగా 14900, 1,960, 15050ల స్థాయిని తాకే అవకాశం ఉంది. ఏ కారణంగానైనా మార్కెట్‌ నీరసిస్తే మాత్రం 14750, 14600, 14450ల వద్ద మద్దతు లభించే అవకాశం ఉంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ట్రేడర్లు దూకుడుగా పోకపోవడమే మంచిది. ఇంట్రాడే  పట్టికలు చూస్తుంటే త్వరలోనే నిప్టీకి బ్రేకవుట్‌ వచ్చే అవకాశం కనిపిస్తోంది.


ఈ వారం స్టాక్‌ రికమండేషన్లు

1.ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌: ఈ కంపె నీ షేర్లు గత వారం ఎన్‌ఎస్‌ఈలో రూ.422.80 వద్ద ముగిశాయి. ట్రేడింగ్‌ వాల్యూమ్స్‌ కూబా బాగానే పెరిగాయి. వచ్చే కొద్ది రోజుల్లో ఈ స్ర్కిప్‌ రూ.440ని తాకే అవకాశం ఉంది. రూ.412 గట్టి స్టాప్‌ లాస్‌గా పెట్టుకుని ఈ కౌంటర్‌లో ప్రవేశించాలి. 

2. గ్లెన్‌మార్క్‌ ఫార్మా: ఈ కంపెనీ షేరు గత వారం ఎన్‌ఎస్‌ఈలో రూ.591.80 వద్ద ముగిసింది. వాల్యూమ్స్‌ను బట్టి చూస్తే ఈ షేర్లకు మంచి కొనుగోళ్ల ఆసక్తి కనిపిస్తోంది. వచ్చే కొద్ది రోజుల్లో గ్లెన్‌మార్క్‌ ఫార్మా షేర్లు రూ.645 వరకు పెరగవచ్చు. అయితే మదుపరులు రూ.564ను స్ట్రిక్ట్‌ స్టాప్‌లాస్‌గా పెట్టుకుని ఈ కౌంటర్‌లో ప్రవేశించాలి. 

 - సమీత్‌ చవాన్‌, (చీఫ్‌ ఎనలిస్ట్‌-టెక్నికల్‌ అండ్‌ డెరివేటివ్స్‌), ఏంజెల్‌ బ్రోకింగ్‌.



నోట్‌:  పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.


Updated Date - 2021-05-10T06:54:21+05:30 IST