Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Tue, 29 Mar 2022 12:51:54 IST

సంత @ రూ.2.16 కోట్లు

twitter-iconwatsapp-iconfb-icon
సంత @ రూ.2.16 కోట్లు

                   - వేలంలో రికార్డు ధర పలికిన పండితాపురం పశువుల సంత


కామేపల్లి(ఖమ్మం): రాష్ట్రంలోనే అతి పెద్ద సంతల్లో ఒకటి అయిన కామేపల్లి మండలం పండితాపురంలోని శ్రీకృష్ణప్రసాద్‌ పశువుల సంత వేలంలో రికార్డు ధరను పలికింది. సోమవారం పండితాపురం సర్పంచ్‌ మూడ్‌ దుర్గా జ్యోతి అధ్యక్షతన ఈ వేలం పాటను నిర్వహించగా ఆరుగురు కాంట్రాక్టర్లు పోటీ పడగా.. భూక్యా వీరన్న రూ.2కోట్ల 16లక్షల6వేలకి దక్కించుకున్నారు. భూక్యావీరన్నతో పాటు ధారావత్‌ నాగేశ్వరరావు, ప్రేమ్‌, రామక్రిష్ణ, వెంకటేశ్వర్లు, వీరనాగులు పోటీ పడ్డారు. ఈ ఆరుగురు దరావతు సొమ్ముగా రూ.30లక్షలు, సాల్వేన్సి కింద రూ.5లక్షల చొప్పున జమ చేశారు. సోమవారం ఉదయం 11.30లకు పాట ప్రారంభం కాగా.. ప్రభుత్వ మద్దతు ధర రూ.1,93,25,900ను అధికారులు ప్రకటించారు. అయితే వేలానికి ఆసక్తిగా ఆరు గురు ఉన్నా ఎప్పటిలాగే భూక్యా వీరన్న, ధారావత్‌ నాగేశ్వరరావు మధ్యే పోటా పోటీ పాట కొనసాగింది. చివరకు రూ.2కోట్ల16లక్షల6వేల భూక్యా వీరన్న పాటను కైవసం చేసుకున్నాడు. ప్రతీ ఏటా ఈ ఇద్దరి మధ్యే పోటీ సాగుతోంది. ఈసారి పాటలో ప్రభుత్వ ధర కంటే గ్రామ పంచాయతీకి రూ.22లక్షలపైగా అదనపు ఆదాయం సమకూరింది. ఈ వేలం పాటను జడ్పీ సీఈవో వింజం వెంకటఅప్పారావు, డీఎల్పీలు పుల్లారావు, ప్రభాకర్‌ ఆధ్వర్యంలో సాగగా.. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ కొమ్మిన్ని శ్రీనివాసరావు, ఎంపీడీవో సిలార్‌ సాహెబ్‌, ఎంపీవో సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శులు నెహ్రూ, రాజేష్‌, రమేష్‌, వెంకటేష్‌, సురేష్‌ పాల్గొన్నారు. 


వేలం పాట పరిసరాలలో 144సెక్షన్‌

సింగరేణి (కారేపల్లి) సీఐ ఆరీఫ్‌అలీఖాన్‌ ఆధ్వర్యంలో 144సెక్షన్‌ అమలు చేసి కట్టుదిట్టమైన భద్రత నిర్వహించారు. కామేపల్లి ఎస్‌ఐ లక్ష్మీభార్గవి, కుషూకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

సంత @ రూ.2.16 కోట్లు


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.