Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Thu, 31 Mar 2022 20:56:43 IST

మార్క్‌వుడ్‌కు శస్త్రచికిత్స పూర్తి.. మత్తులోనే ఐపీఎల్ ప్రస్తావన

twitter-iconwatsapp-iconfb-icon
మార్క్‌వుడ్‌కు శస్త్రచికిత్స పూర్తి.. మత్తులోనే ఐపీఎల్ ప్రస్తావన

లండన్: మోచేతి గాయంతో ఐపీఎల్‌కు దూరమైన ఇంగ్లండ్ పేసర్ మార్క్‌వుడ్‌కు ఇటీవల నిర్వహించిన శస్త్రచికిత్స విజయవంతమైంది. ప్రపంచంలోని అత్యుత్తమ పేసర్లలో ఒకడైన మార్క్‌వుడ్ ఇంగ్లండ్‌కు ఒంటిచేత్తో ఎన్నో విజయాలు అందించాడు. కాగా, ఇటీవల విండీస్‌తో సిరీస్‌ సందర్భంగా గాయపడిన వుడ్ ఆ సరీస్‌కు దూరమయ్యాడు. మార్క్‌వుడ్‌కు శనివారం లండన్‌లో నిర్వహించిన సర్జరీ విజయవంతమైంది. 


ఆ తర్వాత వుడ్ కళ్లు తెరిచిన తర్వాత అడిగిన ప్రశ్నలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ‘ఇంగ్లండ్స్ బార్మీ ఆర్మీ’ ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసింది. వుడ్ కళ్లు తెరుస్తూనే గదిలో ఉన్న ఎవరితోనో మాట్లాడుతూ.. తన మోచేతికి సర్జరీ అయిందని, భుజాలు నొప్పిగా ఉన్నాయని చెప్పాడు. అయినప్పటికీ తాను వేగంగా బౌలింగ్ చేయగలనని చెప్పాడు. సర్జరీ సమయంలో ఇచ్చిన అనెస్థీషియా కారణంగా అతడు మత్తుగా మాట్లాడడం కనిపించింది. 


అవతలి వ్యక్తి ఐపీఎల్‌ను మిస్ కావడంపై అడిగిన ప్రశ్నకు వుడ్ స్పందిస్తూ.. ‘‘అవును బాధగా ఉంది’’ అని బదులిచ్చాడు. అంత మగతలోనూ వుడ్ ఐపీఎల్‌ను ప్రస్తావించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అలాగే, లక్నో సూపర్ జెయింట్స్ హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ మంచి వ్యక్తి అని, అతడంటే ఎంతో అభిమానమని పేర్కొన్నాడు. నిజానికి వుడ్ ఈ ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌కు ఆడాల్సి ఉంది. అయితే, మోచేతి గాయం కారణంగా మొత్తం ఐపీఎల్‌కే దూరమయ్యాడు. దీంతో అతడి స్థానాన్ని ఆండ్రూ టైతో భర్తీ చేశారు. 


ఫిబ్రవరిలో బెంగళూరులో జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో మార్క్‌వుడ్‌ను లక్నో జట్టు రూ. 7.5 కోట్లకు కొనుగోలు చేసింది. కాగా, 32 ఏళ్ల వుడ్ తన సర్జరీకి సంబంధించిన అప్‌డేట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. 


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.