15% వరకు దిద్దుబాటుకు చాన్స్‌:మార్క్‌ మొబియస్‌

ABN , First Publish Date - 2021-12-04T06:14:37+05:30 IST

భారత స్టాక్‌ మార్కెట్‌ మరింత దిద్దుబాటు (కరెక్షన్‌)కు లోనయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ దిద్దుబాటు 10 నుంచి 15 శాతం...

15% వరకు దిద్దుబాటుకు చాన్స్‌:మార్క్‌ మొబియస్‌

భారత స్టాక్‌ మార్కెట్‌ మరింత దిద్దుబాటు (కరెక్షన్‌)కు లోనయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ దిద్దుబాటు 10 నుంచి 15 శాతం వరకు ఉంటుందని ప్రముఖ మార్కెట్‌ నిపుణుడు మార్క్‌ మొబియస్‌ అంచనా వేస్తున్నారు. అయినా పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. ఏడాదిన్నర కాలంగా కొనసాగిన ర్యాలీని దృష్టిలో ఉంచుకుంటే ఇది ఆరోగ్యకరమైన దిద్దుబాటే అవుతుందన్నారు. మంచి కంపెనీల షేర్ల కొనుగోళ్లకు ఈ దిద్దుబాటు చక్కటి అవకాశమన్నారు. అక్టోబరులో జీవితకాల గరిష్ఠ స్థాయిలను తాకిన సెన్సెక్స్‌, నిఫ్టీ ఇప్పటికే 7-8 శాతం వరకు దిద్దుబాటుకు లోనయ్యాయి. 

Updated Date - 2021-12-04T06:14:37+05:30 IST