Advertisement
Advertisement
Abn logo
Advertisement

మరిపెడ ఎస్సై శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్

వరంగల్ అర్బన్‌: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న మరిపెడ ఎస్సై శ్రీనివాస్ రెడ్డిని పోలీస్ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. శ్రీనివాస్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ మహబూబాబాద్ ఎస్పీ కోటిరెడ్డి ఉత్తర్వులు జారీ చేసారు. దళిత మహిళా ట్రైనీ ఎస్సైపై లైంగిక ఆరోపణల నేపథ్యంలో సస్పెండ్ వేటు పడింది. దళిత ట్రైనీ ఎస్సైపై లైంగిక వేధింపుల ఘటనను ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తెచ్చింది. ఏబీఎన్‌లో వచ్చిన ఈ కథనాలకు పోలీస్ ఉన్నతాధికారులు స్పందించారు.

 ట్రైనీ ఎస్ఐపై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న మరిపెడ ఎస్ఐ శ్రీనివాస్‌రెడ్డిపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేయాలని.. మహబూబాబాద్‌ ఎస్పీని వరంగల్ సీపీ తరుణ్‌జోషి ఆదేశించిన విషయం తెలిసిందే. 


పూర్తి వివరాలు:


మహబూబాబాద్ జిల్లా మరిపెడ ఎస్ఐ శ్రీనివాస్‌రెడ్డిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వెళ్లువెత్తున్నాయి. తనపై ఎస్ఐ అర్ధరాత్రి అత్యాచారం చేశారని దళిత ట్రైనీ ఎస్ఐ వరంగల్ సీపీకి ఫిర్యాదు చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. నిన్న రాత్రి తనను అడవిలోకి తీసుకువెళ్లి బలత్కారం చేసినట్లు కుటుంబసభ్యులతో కలిసి సీపీ కార్యాలయానికి వచ్చిన బాధితురాలు ఆరోపించింది. దళిత యువతి కావడమే తన బిడ్డ చేసిన పాపమా? అని కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు. తనకు న్యాయం జరగకుంటే ఉద్యోగానికి రాజీనామా చేస్తానని చెప్పింది. దీంతో వరంగల్ సీపీ తరుణ్‌జోషి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.Advertisement
Advertisement