10 కేజీల గంజాయి పట్టివేత..18 మంది అరెస్టు

ABN , First Publish Date - 2022-01-10T17:03:07+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిన గుట్కా, పాన్‌పరాగ్‌, గంజాయి వంటి పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై నగర పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. ఈ నిషేధిత పొగాకు ఉత్పత్తులను

10 కేజీల గంజాయి పట్టివేత..18 మంది అరెస్టు

చెన్నై/అడయార్‌: రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిన గుట్కా,  పాన్‌పరాగ్‌, గంజాయి వంటి పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై నగర పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. ఈ నిషేధిత పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తున్న వ్యాపారులను గుర్తించి, వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తున్నారు. గతవారం రోజుల్లో డ్రైవ్‌ అగైనెస్ట్‌ బ్యాన్డ్‌ టుబాకో ప్రాడక్ట్‌పై నగర పోలీసులు స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టారు. ఇందులో మొత్తం 9 కేసులు నమోదు చేసి, 18 మందిని అరెస్టు చేశారు. వీరి నుంచి 10 కేజీల గంజాయితో పాటు 1.14 కేజీల మావా, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. 

Updated Date - 2022-01-10T17:03:07+05:30 IST