విశాఖ: అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పెదబయలు మండలం రోగులుపేట జంక్షన్ వద్ద 140 కేజీల గంజాయిని స్పెషల్ ఎన్‌ఫోర్సమెంట్ బ్యూరో సిబ్బంది పట్టుకున్నారు. గంజాయిని రవాణా చేసే వాహనాన్ని సీజ్ చేశారు. ఒకరిని అరెస్ట్ చేసారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.