Abn logo
Aug 9 2021 @ 21:58PM

గంజాయి పట్టివేత

కృష్ణా: అక్రమంగా రవాణా చేస్తున్న నిషేధిత గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. కంచికచర్ల జాతీయ రహదారిలోని అక్షయ హోటల్ సమీపంలో లారీలో తరలిస్తున్న 600 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. పాడేరు నుంచి ఢిల్లీకి గంజాయిని నిందితులు తరలిస్తున్నారు. గంజాయిని తరలిస్తున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. లారీని సీజ్ చేశారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.