నల్గొండ: చిట్యాలలో భారీగా పోలీసులు గంజాయిని పట్టుకున్నారు. 65వ జాతీయ రహదారిపై పోలీసులు బస్సులలో తనిఖీలు చేపట్టారు. ఆంధ్ర సీలేరు నుంచి ఆదిలాబాద్ వెళ్తున్న బస్సులో తనిఖీలు చేస్తుండగా..22 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా గంజాయి తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.