గంజాయి హాట్‌స్పాట్లను గుర్తించాలి

ABN , First Publish Date - 2021-10-23T06:23:46+05:30 IST

గంజాయి హాట్‌స్పాట్లను గుర్తించాలని ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ అన్నారు. చివ్వెంల పోలీ్‌సస్టేషనను ఆయన శుక్రవారం ఆకస్మికంగా తనిఖీచేసి, స్టేషన పరిసరాలను పరిశీలించి మాట్లాడారు.

గంజాయి హాట్‌స్పాట్లను గుర్తించాలి
చివ్వెంలలో సిబ్బందితో మాట్లాడుతున్న ఎస్పీ రాజేంద్రప్రసాద్‌

చివ్వెంల, అక్టోబరు 22: గంజాయి హాట్‌స్పాట్లను గుర్తించాలని ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ అన్నారు. చివ్వెంల పోలీ్‌సస్టేషనను ఆయన శుక్రవారం ఆకస్మికంగా తనిఖీచేసి, స్టేషన పరిసరాలను పరిశీలించి మాట్లాడారు. గంజాయి నియంత్రణకు సిబ్బంది సమష్టిగా పనిచేయాలన్నారు. గంజాయి, గుట్కా రహిత జిల్లా కోసం చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆయన వెంట స్పెషల్‌ బ్రాంచ ఇనస్పెక్టర్‌ శ్రీనివాస్‌, ఎస్‌ఐ విష్ణు, రత్నం, అంతిరెడ్డి, వెంకన్న ఉన్నారు. 
గంజాయి పై ఉక్కుపాదం 
మునగాల:
గంజాయిపై ఉక్కుపాదం మోపాలని ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ అన్నారు. గంజాయి నియంత్రణపై మునగాల పోలీ్‌సస్టేషనలో నడిగూడెం, మునగాల సిబ్బందితో శుక్రవారం రాత్రి సమీక్షా సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొరుగు రాష్ట్రం నుంచి రవాణా అవుతున్న గంజాయిని అరికట్టేందుకు పోలీస్‌ సిబ్బంది పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. గంజాయికి బానిసలైన వారిని గుర్తించి, సమాచారం ఇస్తే వారికి కౌన్సిలింగ్‌ ఇస్తామన్నారు. సమావేశంలో డీఎస్పీ రఘు, సీఐ ఆంజనేయులు, మునగాల, నడిగూడెం ఎస్‌ఐలు శ్రీనివాసులు, ఏడుకొండల్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-10-23T06:23:46+05:30 IST