అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత

ABN , First Publish Date - 2022-07-24T11:30:39+05:30 IST

అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి రాజమహేంద్రవరం సమీపంలో కొంతమూరుకు రెండు వాహనాల్లో తరలిస్తున్న 52 బస్తాల గంజాయిని

అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత

అల్లూరి సీతారామరాజు జిల్లా: అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి రాజమహేంద్రవరం సమీపంలో కొంతమూరుకు రెండు వాహనాల్లో తరలిస్తున్న 52 బస్తాల గంజాయిని కోరుకొండ శివారు పశ్చిమగోనగూడెం విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి  విలువ రూ.1.20 కోట్లు ఉండవచ్చని అంచనా వేశారు. ఈ సందర్భంగా నార్త్‌ జోన్‌ డీఎస్పీ కడలి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఇంటెలిజెన్స్‌ వర్గాల నుంచి వచ్చిన సమాచారం మేరకు శనివారం సాయంత్రం పశ్చిమగోనగూడెం విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వద్ద కాపు కాసి అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నామన్నారు. ట్రావెలర్‌ వ్యాన్‌లో 50 బస్తాలు, హోండా కారులో 2 బస్తాలు తరలిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఈ సందర్భంగా రఘువీర్‌ రాయ్‌ అతని భార్య ప్రశాంతి, డ్రైవర్లు నజీం, బుజ్జిలను అరెస్టు చేశారు. రెవెన్యూ అధికారుల సమక్షంలో 52 బస్తాల్లో గంజాయిని తూకం వేసి కచ్చితమైన విలువను నిర్ధారిస్తామన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి నిందితులను కోర్టుకు అప్పగిస్తామన్నారు.

Updated Date - 2022-07-24T11:30:39+05:30 IST