నేత్రపర్వంగా మరిడిమాంబ జాతర

ABN , First Publish Date - 2021-08-06T05:45:24+05:30 IST

కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా, ఈ ప్రాంత ప్రజల ఆరాధ్య దేవతగా విరాజిల్లుతున్న మరిడిమాంబ జాతర మండలంలోని వై.లోవ గ్రామంలో గురువారం నేత్రపర్వంగా సాగింది.

నేత్రపర్వంగా మరిడిమాంబ జాతర
అమ్మవారి దర్శనానికి పడవల్లో వెళుతున్న భక్తులు


  పడవల ద్వారా శారదా నది దాటి పూజలు 

రాంబిల్లి, ఆగస్టు 5: కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా, ఈ ప్రాంత ప్రజల ఆరాధ్య దేవతగా విరాజిల్లుతున్న మరిడిమాంబ జాతర మండలంలోని వై.లోవ గ్రామంలో గురువారం నేత్రపర్వంగా సాగింది. గ్రామానికి ఆనుకుని ఉన్న శారదా నది అవతల ఒడ్డున గట్టుపై కొలువుదీరిన ఈ అమ్మవారి దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.  బోట్లు ద్వారా శారదా నది దాటి వెళ్లి అమ్మవారికి పసుపు, కుంకుమలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో ఆయా ప్రాంతాలు సందడిగా మారాయి. సర్పంచ్‌ బి.నారాయణరావు ఆధ్వర్యంలో నిర్వాహకులు విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టారు.

Updated Date - 2021-08-06T05:45:24+05:30 IST