పోలీసులు కొట్టడంతోనే మరియమ్మ మృతి: ప్రీతం

ABN , First Publish Date - 2021-06-21T06:59:07+05:30 IST

అడ్డగూడూరు పోలీసులు కొట్టడంతోనే మరి యమ్మ మృతి చెందిందని కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగరిగారి ప్రీతం అన్నారు. పోలీసుల కస్టడీలో మరియమ్మ మృతి చెందిన ఘటనపై అడ్డగూడూరు పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం ఆయన వివరాలు సేక రించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

పోలీసులు కొట్టడంతోనే మరియమ్మ మృతి: ప్రీతం
అడ్డగూడూరులో విలేకరులతో మాట్లాడుతున్న కాంగ్రెస్‌ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ప్రీతం

మోత్కూరు, జూన్‌ 20: అడ్డగూడూరు పోలీసులు కొట్టడంతోనే మరి యమ్మ మృతి చెందిందని కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగరిగారి ప్రీతం  అన్నారు. పోలీసుల కస్టడీలో మరియమ్మ మృతి చెందిన ఘటనపై  అడ్డగూడూరు పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం ఆయన వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.  మరియమ్మ, శీలం రంగ య్యలా మరో లాకప్‌డెత్‌ జరుగకుండా న్యాయపోరాటం చేస్తానన్నారు.  మృతురాలి స్వగ్రామం వెళ్లి ఆమె కుటుంబసభ్యులతో మాట్లాడుతానని, ఆమె కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడుతానన్నారు. ఆయన వెంట రాష్ట్ర నాయకుడు ఎండీ అయాజ్‌ తదితరులు ఉన్నారు.




జ్యుడిషియల్‌ విచారణ నిర్వహించాలి: మానిటరింగ్‌ కమిటీ

భువనగిరి రూరల్‌: అడ్డగూడూరు పోలీస్‌స్టేషన్‌లో మహిళ లాకప్‌ డెత్‌పై జ్యుడీషియల్‌ విచారణ నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మాని టరింగ్‌ కమిటీ సభ్యులు బి.జహంగీర్‌, దళిత ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు భట్టు రాంచంద్రయ్య, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ పోత్నక్‌ప్రమోద్‌కుమా ర్‌లు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. లాకప్‌ డెత్‌కు కారణమైన పోలీసు సిబ్బందిపై చర్యలు తీసుకుని విచారణ చేయించాలని కోరుతూ నల్ల జెండాతో భువనగిరిలో నిరసన ర్యాలీ నిర్వహించి అంబేడ్కర్‌ చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు దళిత మహిళపై అకారణంగా లాఠీలు ఝుళిపించి ఆమె మృతికి కారణమయ్యారని, ఆమె కుమారుడి పరిస్థితి కూడా విషమంగా ఉందని  వారు తెలిపారు.  ఎస్సీ, ఎస్టీ అల్రాసిటీ చట్టం కింద వచ్చే ప్రయోజనాలను ఆ కుటుంబానికి వర్తింపజేసి రూ.25లక్షల ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.  కార్యక్రమంలో నాయకులు ఈరపాక నర్సింహ,  కొడారి వెంకటేష్‌, ఇటుకాల దేవేందర్‌, కుతాడి సురేష్‌, బి.నరేష్‌, మెరుగుమల్ల ఆనంద్‌, ముత్యాల మనోజ్‌, భాస్కర్‌నాయక్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-06-21T06:59:07+05:30 IST