Abn logo
Mar 5 2021 @ 16:41PM

కోలీవుడ్‌ బాక్సాఫీస్‌ కూడా కళకళలాడుతోంది

కరోలా కష్టకాలం తర్వాత చిత్ర పరిశ్రమలో పరిస్థితులు చక్కబడుతున్నాయి. కొత్త సినిమా ప్రారంభోత్సవాలు వరుసగా జరుగుతుండగా, సినిమా షూటింగులు ఊపందుకున్నాయి. అదేవిధంగా కరోనా వైరస్‌ కారణంగా గత యేడాది విడుదలకు నోచుకోని పలు చిత్రాలు ఇపుడు వరుసగా విడుదలకు సిద్ధమయ్యాయి. టాలీవుడ్‌లో ఈ సందడి ఎలా ఉందో తెలియంది కాదు. ఙప్పుడు కోలీవుడ్‌ కూడా వరుస సినిమాలతో కళకళలాడుతోంది. ఈ క్రమంలో మార్చి నెల మొదటి శుక్రవారమైన 5వ తేదీన పలు చిత్రాలు తెరపైకి రానున్నాయి. వీటిలో ఒకటి సీనియర్‌ నటుడు అరుణ్‌ పాండ్యన్‌, ఆయన కుమార్తె కీర్తి పాండ్యన్‌ నటించిన ‘అన్బిర్కినియాల్‌’ చిత్రం ఒకటి. దాదాపు 18 యేళ్ళ తర్వాత అరుణ్‌ పాండ్యన్‌ గత చిత్రాలకు భిన్నంగా ఈ చిత్రంలో ఓ కొత్త పాత్రలో కనిపించనున్నారు. నిజజీవితంలో తండ్రీకుమార్తెలుగా ఉన్న వీరిద్దరూ ఈ చిత్రంలోనూ తండ్రీకుమార్తెలుగా నటించారు. గోకుల్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కించారు. ఇకపోతే, సెల్వరాఘవన్‌ దర్శకత్వంలో ఎస్‌జే. సూర్య, రెజీనా కెసాండ్రా నటించిన చిత్రం ‘నెజమ్‌ మరప్పదిల్లై’. ఈ చిత్రం కూడా ఈ శుక్రవారమే విడుదలైంది. ఇదో హార్రర్‌ చిత్రం. పైగా ఈ చిత్రంపై ప్రేక్షకులతో పాటు సినీ ప్రరిశ్రమ వర్గాల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. అలాగే, ఈనెల 12వ తేదీన శివకుమార్‌, నిక్కి గల్రానీ కాంబినేషన్‌లో కదిరవేల్‌ దర్శకత్వంలో పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ‘రాజవంశం’ చిత్రం కూడా విడుదల కానుంది.

ఇదిలావుంటే.. శివకార్తికేయన్‌, ప్రియాంకా అరుళ్‌మోహన్‌ జంటగా నటించిన ‘డాక్టర్‌’ చిత్రాన్ని కూడా ఈనెల 26వ తేదీన విడుదల చేయనున్నట్టు  నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం యాక్షన్‌ థ్రిల్లర్‌గా నిర్మితమైంది. ఇందులో హీరో శివకార్తికేయన్‌ వైద్యుడి పాత్రలో కనిపించనున్నారు. అలాగే, మరో హీరో ధనుష్‌ నటించిన ‘జగమే తందితరమ్‌’ చిత్రం కూడా ఈనెల 14వ తేదీన ఓటీటీలో విడుదల కానుంది. ఐశ్వర్యలక్ష్మి హీరోయిన్‌గా నటించగా, కార్తీక్‌ సుబ్బురాజ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం థ్రిల్లర్‌ జానర్‌లో నిర్మించారు. దీంతో పాటు ఆర్య - సయేషా సైగల్‌ జంటగా నటించిన యాక్షన్‌, కామెడీ, డ్రామా మూవీగా రూపొందిన ‘టెడ్డీ’ కూడా ఈ నెలలోనే విడుదల కానుంది.

Advertisement
Advertisement
Advertisement