Chitrajyothy Logo
Advertisement
Published: Sat, 22 Jan 2022 00:20:32 IST

మార్చి 18.. లేదా ఏప్రిల్‌ 28

twitter-iconwatsapp-iconfb-icon
మార్చి 18.. లేదా ఏప్రిల్‌ 28

ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ కథానాయకులుగా నటించిన చిత్రం ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’. ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకుడు. ఈ సంక్రాంతికి విడుదల కావాల్సింది. కానీ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల వాయిదా పడింది. ఇప్పుడు కొత్త రిలీజ్‌ డేట్లు ప్రకటించారు. పరిస్థితులన్నీ అనుకూలిస్తే మార్చి 18న, లేదంటే.. ఏప్రిల్‌ 28న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. కరోనా ఉఽఽధృతి తీవ్రంగా ఉండడంతో ఉత్తరాదిన థియేటర్లు మూసేశారు. చాలా చోట్ల 50 శాతం ఆక్యుపెన్సీతోనే థియేటర్లు నడిపిస్తున్నారు. దాంతో పాటు నైట్‌ కర్ఫ్యూ అమలులో ఉంది. ఈ ఇబ్బందులన్నీ తొలగిపోతే మార్చి 18నే ఈ చిత్రాన్ని తీసుకొస్తారు. లేదంటే ఏప్రిల్‌ 28న రావడం మాత్రం పక్కా. కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రంలో అజయ్‌దేవగణ్‌, శ్రియ కీలక పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. 


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International