పవార్‌పై ఎఫ్‌బీలో పోస్టు షేర్‌.. నటి అరెస్టు

ABN , First Publish Date - 2022-05-15T07:29:30+05:30 IST

ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ను కించపరుస్తూ ఫేస్‌బుక్‌ లో పెట్టిన పోస్టును ..

పవార్‌పై ఎఫ్‌బీలో పోస్టు షేర్‌.. నటి అరెస్టు

ముంబై, మే 14: ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ను కించపరుస్తూ ఫేస్‌బుక్‌ లో పెట్టిన పోస్టును షేర్‌చేసిన కేసులో మరాఠీ నటి కేతకి ఛితాలేను థానే పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. ఎన్సీపీ చీఫ్‌ పూర్తి పేరును ఎఫ్‌బీ  పోస్టులో నేరుగా ప్రస్తావించకపోయినా.. ఇంటిపేరు పవార్‌, వయసు 80 అని ప్రస్తావించారు. అంతేకాదు ‘‘నరకం నీకోసం ఎదురుచూస్తోంది’’, ‘‘నువ్వు బ్రాహ్మణ ద్వేషివి’’ అంటూ ఆ పోస్టులోని వ్యాఖ్యలు పరోక్షంగా పవార్‌ను ఉద్దేశించినవేనని ఎన్సీపీ నేతలు ఆరోపించారు. 

Updated Date - 2022-05-15T07:29:30+05:30 IST