మరాక్‌

ABN , First Publish Date - 2021-05-15T17:07:49+05:30 IST

మటన్‌ బోన్స్‌-కేజీ, ఉల్లిపాయలు- 100గ్రా, పచ్చిమిర్చి- 50గ్రా, అల్లంవెల్లుల్లి పేస్టు -50గ్రా, ధనియాలు- 30గ్రా,మిరియాలు- 30గ్రా, ఉప్పు- తగినంత, నూనె- సరిపడా, కారం- 50గ్రా, కొత్తిమీరవేళ్లు- కొద్దిగా,

మరాక్‌

కావలసినవి: మటన్‌ బోన్స్‌-కేజీ, ఉల్లిపాయలు- 100గ్రా, పచ్చిమిర్చి- 50గ్రా, అల్లంవెల్లుల్లి పేస్టు -50గ్రా, ధనియాలు- 30గ్రా,మిరియాలు- 30గ్రా, ఉప్పు- తగినంత, నూనె- సరిపడా, కారం- 50గ్రా, కొత్తిమీరవేళ్లు- కొద్దిగా, పాన్‌ కి జాద్‌- 50గ్రా, ఖుస్‌ కి జాద్‌ - 50గ్రా.


తయారీ విధానం: ఒక పాత్రలో మటన్‌ బోన్స్‌ తీసుకుని అందులో కొత్తిమీర వేళ్లు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడికించాలి. నీళ్లు మరిగాక స్టవ్‌పై దింపి వడగట్టుకుని స్టాక్‌ని పక్కన పెట్టుకోవాలి. స్టవ్‌పై ఒక పాత్రను పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఉల్లిపాయలు వేసి వేగించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్టు, మిరియాలు, ధనియాలు, పాన్‌ కి జాద్‌, ఖుస్‌ కి జాద్‌ వేసి మరికాసేపు వేగించాలి. ఇప్పుడు మటన్‌ వేసి మరికాసేపు ఉడికించాలి. తరువాత పక్కన పెట్టుకున్న స్టాక్‌ వేసి మరిగించాలి. ఎముక మజ్జ బయటకు వచ్చేంత వరకు ఉడికించాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. వేడివేడిగా సర్వ్‌ చేసుకోవాలి.


Updated Date - 2021-05-15T17:07:49+05:30 IST