డీగోకు మార, డోనా నివాళి

ABN , First Publish Date - 2020-11-29T10:08:57+05:30 IST

అర్జెంటీనా రాజధాని బ్యూన్‌సఎయిర్స్‌కు చెందిన వాల్టర్‌ రొటుండోకు దివంగత సాకర్‌ స్టార్‌ డీగో మారడోనా అంటే పిచ్చి అభిమానం. అతడి ఆటంటే ప్రాణం. అందుకే డీగో పేరును తన వీపుపై టాటూగా అతడు వేయించుకున్నాడు. అంతేకాదు.. తన ఇద్దరు కవల ఆడపిల్లలకు ఆ దిగ్గజ ఆటగాడి పేరు వచ్చేలా..

డీగోకు మార, డోనా నివాళి

బ్యూనస్‌ ఎయిర్స్‌: అర్జెంటీనా రాజధాని బ్యూన్‌సఎయిర్స్‌కు చెందిన వాల్టర్‌ రొటుండోకు దివంగత సాకర్‌ స్టార్‌ డీగో మారడోనా అంటే పిచ్చి అభిమానం. అతడి ఆటంటే ప్రాణం. అందుకే డీగో పేరును తన వీపుపై టాటూగా అతడు వేయించుకున్నాడు. అంతేకాదు.. తన ఇద్దరు కవల ఆడపిల్లలకు ఆ దిగ్గజ ఆటగాడి పేరు వచ్చేలా.. మార, డోనా అని పెట్టుకున్నాడు. డీగో కన్నుమూయడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరైంది. అతడికి వినూత్నంగా నివాళి అర్పించింది. మారడోనా పదో నెంబర్‌ను తమ జెర్సీలపై ధరించి ఆ అక్కాచెల్లెళ్లు డీగోకు వీడ్కోలు పలికారు.

Updated Date - 2020-11-29T10:08:57+05:30 IST