రాష్ట్రం పేరేమిటో చెప్పగలరా?

ABN , First Publish Date - 2020-05-06T05:30:00+05:30 IST

ఆట సరదాగా, మెదడుకు పదును పెట్టేలా ఉండాలి. సాధారణ అంశాలను తీసుకొని, గేమ్‌గా మలిస్తే భలేగా ఉంటుంది. అలాందిదే ఈ ఆట. ఇంకెందుకాలస్యం...

రాష్ట్రం పేరేమిటో చెప్పగలరా?

ఆట సరదాగా, మెదడుకు పదును పెట్టేలా ఉండాలి. సాధారణ అంశాలను తీసుకొని, గేమ్‌గా మలిస్తే భలేగా ఉంటుంది. అలాందిదే ఈ ఆట. ఇంకెందుకాలస్యం... ఈ రోజు ట్రై చేయండి.


  1. ఇండియా మ్యాప్‌ తీసుకోండి. మీ పాఠ్యపుస్తకాల్లో మ్యాప్‌ దొరుకుతుంది. నెట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుని ప్రింట్‌ తీసుకోవచ్చు. ఇంట్లో వేలాడదీసిన పెద్ద పటం ఉంటే ఇంకా మంచిది.
  2. రాష్ట్రం పేరు తెలుసుకోవడానికి పది ప్రశ్నలు అడగాలి. వాటి సమాధానాల ఆధారంగా రాష్ట్రం పేరు ఊహించి చెప్పాల్సి ఉంటుంది. 
  3. ఉదాహరణకు సిక్కిం రాష్ట్రం ఎంపిక చేశారనుకుందాం. అప్పుడు ఆట ఆడుతున్న వ్యక్తి రాష్ట్రం పేరు తెలుసుకోవడానికి రకరకాల ప్రశ్నలు వేస్తుండాలి. ఇతరులు అవును/కాదు అని మాత్రమే సమాధానం చెప్పాలి.
  4. మొదటి ప్రశ్న: అది ఈశాన్య రాష్ట్రమా? జవాబు: అవును.
  5. రెండో ప్రశ్న: బంగ్లాదేశ్‌తో సరిహద్దును కలిగి ఉందా? జవాబు: కాదు.
  6. మూడో ప్రశ్న: ఆ రాష్ట్రం నేపాల్‌తో సరిహద్దును కలిగి ఉంటుందా? జవాబు: అవును. ఇలా పది ప్రశ్నల వరకు అడగొచ్చు. 
  7. సమాధానాల ఆధారంగా రాష్ట్రం పేరు చెప్పాలి. సమాధానం కరెక్ట్‌గా చెబితే గెలిచినట్టు. అదికూడా పది ప్రశ్నలు మాత్రమే అడిగి చెప్పాల్సి ఉంటుంది. 
  8. ఈ ఆటతో సమయం సరదాగా గడిచిపోవడంతో పాటు రాష్ట్రాలు, వాటికి సంబంధించిన సరిహద్దులు, ఇతర అంశాలపై అవగాహన ఏర్పడుతుంది.

Updated Date - 2020-05-06T05:30:00+05:30 IST