Abn logo
Aug 2 2021 @ 02:06AM

చర్ల అడవుల్లో కాల్పులు.. మావోయిస్టు మృతి

చర్ల, అగస్టు 1: అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహిస్తోన్న మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. భద్రాద్రి జిల్లా చర్ల అడవుల్లో ఆదివారం ఉదయం పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. అతడి మృతదేహం వద్ద ఒక 303 రైఫిల్‌, రెండు కిట్‌ బ్యాగులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుడి వయసు 23 ఏళ్లు ఉంటుందని భద్రాద్రి జిల్లా ఎస్పీ సునీల్‌దత్‌ తెలిపారు. మావోయిస్టు మృతదేహాన్ని భద్రాచలం వైద్యశాలకు తరలించారు. కాగా, ఛత్తీస్‌గఢ్‌లోని ఆవుపల్లి మండలం రేఖపల్లి గ్రామానికి చెందిన మిలీషియా సభ్యుడిని చర్ల మండలం దానవాయిపేట శివారులో చర్ల పోలీసులు అరెస్టు చేశారు. అమరవీరుల సంస్మరణ వారోత్సవాల నేపథ్యంలో ఊసూరు ఏరియా కమిటీ సెక్రటరీ గంగా ఆదేశాల ప్రకారం అతడు ఇచ్చిన కరపత్రాలను నిమ్మలగూడెం, కుర్నపల్లి గ్రామాల మధ్య పడేసేందుకు బైక్‌పై మిలీషియా సభ్యుడు వెళ్లాడు. దానవాయిపేట వద్ద చర్ల పోలీసులకు పట్టుబడ్డాడు. 

క్రైమ్ మరిన్ని...