ఏపీలో లొంగిపోయిన మావోయిస్టులు

ABN , First Publish Date - 2021-08-12T22:26:26+05:30 IST

అమరావతి: ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ సమక్షంలో గురువారం ఆరుగురు మావోయిస్టులు లొంగిపోయారు. గత నెలలో ఒక మావోయిస్టు నేత సరెండర్ అయ్యారు.

ఏపీలో లొంగిపోయిన మావోయిస్టులు

మావోయిస్టుల మాటలను గిరిజనులు నమ్మడం లేదు..

ప్రభుత్వాల ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుంది: ఏపీ డీజీపీ


అమరావతి: ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ సమక్షంలో గురువారం ఆరుగురు మావోయిస్టులు లొంగిపోయారు. గత నెలలో ఒక మావోయిస్టు నేత సరెండర్ అయ్యారు. మావోల గురించి ఆయన కొంత సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం ఒక డివిజనల్ కమాండర్, ఇద్దరు ఏరియా కమిటీ సభ్యులతో పాటు మరో ముగ్గురు మావోలు లొంగిపోయారు. ఈ సందర్భంగా ఏపీ డీజీపీ మాట్లాడుతూ ప్రస్తుతం మావోయిస్టుల మాటలను గిరిజనులు నమ్మడం లేదని చెప్పారు. రెండేళ్లలో ఏజెన్సీల్లో సమస్యలు తగ్గాయని, దీంతో మావోల విప్లవం మాటలను ఆదీవాసీలు నమ్మడం లేదని ఆయన తెలిపారు. ఏజెన్సీల్లో భూ సమస్యలన్నీ పరిష్కారమవుతాయని చెప్పారు. పట్టాలు మంజూరు చేయడం వల్ల చాలా సమస్యలు తగ్గాయని చెప్పారు. రెండేళ్లలో వెల్ఫేర్ బాగా పెరిగిందని తెలిపారు. ఈ ప్రభావం గ్రామాల్లో బలంగా ఉందని.. అందుకే మావోయిస్టులకు గిరిజనుల నుంచి మద్దతు లభించడం లేదని చెప్పారు.

ప్రభుత్వం ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని ఆదివాసీలు నమ్ముతున్నారని తెలిపారు. మావోలు చెబుతున్న స్టీల్ ప్లాంట్ సమస్య అంటే ఏంటో కూడా గిరిజనులకు తెలీదన్నారు. గతంలో 8 ఏరియా కమిటీలు ఉండేవని.. ప్రస్తుతం నాలుగు మాత్రమే ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వ వలంటీర్లు బాగా పని చేస్తున్నారని లొంగిపోయిన మావోలు చెబుతున్నారని తెలిపారు. మధ్యవర్తులు లేకుండా పథకాలు అందుతున్నాయనే విషయం గిరిజనుల్లోకి వెళ్ళిందని పేర్కొన్నారు. దీంతో వారిలో అవగాహన, మార్పు వచ్చిందని డీజీపీ వివరించారు.


సమస్యల కారణంగానే బయటికి వచ్చాం..

తమలో తమకే సమస్యలు వస్తున్నాయని, దీనికి తోడు ఇటీవల సమాజంలో మార్పు వస్తోందని.. దీంతోనే తాము ప్రజా జీవితంలోకి వచ్చామని లొంగిపోయిన మావోలు తెలిపారు. బాక్సైట్ పై ప్రభుత్వ నిర్ణయంతో గిరిజనుల్లో మార్పు వచ్చిందన్నారు. దీంతో తమకు మద్దతు తగ్గిందని చెప్పారు. మావోల పార్టీలో ఒక వర్గం వారు ఆదివాసీలను చిన్నచూపు చూస్తున్నారని తెలిపారు. దీనికితోడు రెండేళ్లుగా పార్టీలో చేరికలే లేవని వారు పేర్కొన్నారు.

Updated Date - 2021-08-12T22:26:26+05:30 IST