మావోయిస్టు నరేష్‌కు కన్నీటి వీడ్కోలు

ABN , First Publish Date - 2022-01-21T05:56:17+05:30 IST

మావోయిస్టు నరేష్‌కు కన్నీటి వీడ్కోలు

మావోయిస్టు నరేష్‌కు కన్నీటి వీడ్కోలు
మృతదేహంపై ఎర్రజెండాను కప్పుతున్న అమరుల బంధు మిత్రుల కమిటీ సభ్యులు

రేగొండ మండలం జగ్గయ్యపేటలో అంత్యక్రియలు

అమరుల బంధుమిత్రుల కమిటీ సభ్యుల హాజరు

రేగొండ, జనవరి 20: ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ సరిహద్దులో మంగళవా రం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన గుండాల-నర్సంపేట ఏరియా కమిటీ కమాండర్‌ కొమ్ముల నరేష్‌ (32) అలియాస్‌ బుచ్చన్న మృతదేహం స్వగ్రామం భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం జగ్గ య్య పేటకు గురువారం రాత్రి చేరుకుంది. ఛత్తీస్‌గఢ్‌లో పోస్ట్‌మార్టం అనంత రం మృతదేహాన్ని తీసుకురాగా గ్రామస్థులు, కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. మృతదేహంపై అమరుల బంఽధు మిత్రుల కమిటీ సభ్యులు ఎర్రజెండాను కప్పారు. పూలమాల వేసి నివాళులర్పించారు. చిన్నతనంలోనే పోరుబాట పట్టన నరేష్‌ను విగతజీవిగా చూడాల్సి వచ్చిందని గ్రామస్థులు కంటతడి పెట్టారు. ‘జోహర్‌ బుచ్చన్న..’ నినాదాలు అంతిమయాత్రలో మార్మోగాయి. నరేష్‌ అంత్యక్రియలు గ్రామ శివారు లోని శ్మశాన వాటికలో జరిగాయి. అమ రుల బంఽధుమిత్రుల కమిటీ రాష్ట్ర ఉపా ధ్యక్షురాలు శాంతక్క, జాయింట్‌ సెక్రటరీ భవాని, సభ్యురాలు నవతక్క పాల్గొ న్నారు. ఈ సందర్భంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎస్సైలు శ్రీకాం త్‌రెడ్డి, కృష్ణప్రసాద్‌గౌడ్‌ నేతృత్వంలో వాహనాలను తనిఖీ చేశారు. ఎలాంటి అవాఛనీ య సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట నిఘా పెట్టారు.  

సమాజం క్షమించదు : శాంతక్క

బూటకపు ఎన్‌కౌంటర్లను సమాజం ఎన్నటికీ క్షమించదని అమరుల బంఽధుమిత్రుల కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శాంతక్క అన్నారు. నరేష్‌ అంతిమ యాత్ర సందర్భంగా ఆమె మాట్లాడారు. చిత్రహింసలు పెట్టి నరే ష్‌ను కాల్చి చంపి ఎన్‌కౌంటర్‌గా చిత్రీకరించారని విమర్శించారు. ముఖం కూడా గుర్తుపట్టలేని స్థితిలో ఉండటమే ఇందుకు నిదర్శనమన్నారు.

Updated Date - 2022-01-21T05:56:17+05:30 IST