విశాఖ: జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకూ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు మావోయిస్ట్ పార్టీ ప్రకటించింది. మావోయిస్టు వారోత్సవాలు వాడవాడలా జరుపుకోవాలని మావోయిస్టులు పిలుపునిచ్చింది. సంస్మరణ వారోత్సవాలపై పోలీసులు అప్రమత్తమయ్యారు. వారోత్సవాల నేపథ్యంలో మావోలు అలజడి సృష్టించే అవకాశం ఉందని నిఘా వర్గాల హెచ్చరికతో సీఆర్‌పీఎఫ్, స్పెషల్‌పార్టీ, గ్రేహౌండ్స్ బలగాలు విస్తృత గాలింపు చేపడుతున్నారు. రాజకీయ నాయకులు, ప్రముఖులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. వారోత్సవాల్లో భాగంగా విశాఖ జిల్లా సీలేరు వద్ద పోలీసులు వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, తూర్పుగోదావరి జిల్లాల నుంచి వచ్చిపోయే వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. ఆంధ్రా- ఒడిశా సరిహద్దుల్లో గల చిత్రకొండ, సీలేరు సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ బలగాలు కూంబింగ్ చేస్తున్నాయి.