క్షేమంగా ఉన్న జవాన్‌ రాకేశ్వర్‌సింగ్‌ ఫొటోను విడుదల చేసిన మావోలు

ABN , First Publish Date - 2021-04-07T21:15:56+05:30 IST

తమ చెరలో ఉన్న సీఆర్పీఎఫ్‌ జవాన్‌ రాకేశ్వర్‌సింగ్‌ క్షేమంగా ఉన్నాడని మావోయిస్ట్ పార్టీ ప్రకటించింది. అంతేకాదు క్షేమంగా ఉన్న జవాన్‌

క్షేమంగా ఉన్న జవాన్‌ రాకేశ్వర్‌సింగ్‌ ఫొటోను విడుదల చేసిన మావోలు

రాయపూర్: తమ చెరలో ఉన్న సీఆర్పీఎఫ్‌ జవాన్‌ రాకేశ్వర్‌సింగ్‌ క్షేమంగా ఉన్నాడని మావోయిస్ట్ పార్టీ ప్రకటించింది. అంతేకాదు క్షేమంగా ఉన్న జవాన్‌ ఫొటోను మావోలు విడుదల చేశారు. మధ్యవర్తులు ఎవరో చెబితే విడుదలపై ప్రకటన చేస్తామని మావోయిస్టులు చెబుతున్నారు. ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో పోలీసుల కూంబింగ్‌ ఎక్కువగా ఉండడంతో తెలంగాణ సరిహద్దుల్లోనే అప్పగించే యోచనలో మావోయిస్టులు ఉన్నట్లు తెలుస్తోంది. ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో భీకర కాల్పుల తర్వాత కోబ్రా యూనిట్‌కు చెందిన రాకేశ్వర్‌సింగ్ అనే జవాన్ కనిపించకుండా పోయారు. అయితే ఆ జవాన్ తమ అదుపులో ఉన్నారని మావోయిస్టులు లేఖ ద్వారా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ లేఖలో మరికొన్ని డిమాండ్లను మావోలు ప్రభుత్వం ముందు ఉంచారు. ‘ఆపరేషన్ ప్రహార్-3’ అనే పేరుతో నక్సల్ వ్యతిరేక ఆపరేషన్లు నిర్వహిస్తున్నారని, దేశంలో హక్కుల ఉద్యమాలను అణిచివేసేందుకు ప్రభుత్వాలు, పోలీసు బలగాలను ఉపయోగిస్తున్నాయని, పోలీసు బలగాలను తక్షణమే నిలిపివేయాలని మావోలు లేఖలో డిమాండ్ చేశారు.

Updated Date - 2021-04-07T21:15:56+05:30 IST