ఢిల్లీ: ఏపీలో మావోయిస్టు ప్రభావిత జిల్లాలు 5 నుంచి 2కి తగ్గాయని హోంమంత్రి సుచరిత తెలిపారు. ఢిల్లీలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోమంత్రి అమిత్షా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సుచరిత మాట్లాడుతూ విశాఖ, తూర్పు గోదావరి జిల్లాలోనే కొంతమేర మావోయిస్టుల ప్రభావం ఉందని తెలిపారు. సీఎం జగన్ పాలనా వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చారని పేర్కొన్నారు. వాలంటీర్ వ్యవస్థతో గిరిజన ప్రాంతాల్లోనూ సంక్షేమాన్ని అందించామని తెలిపారు. ఉద్యమాల్లోకి ఆకర్షితులయ్యేవారికి విద్యా, మౌలిక సౌకర్యాలు మెరుగుపర్చడం ద్వారా సమస్యకు పరిష్కారం చూపొచ్చని సీఎం జగన్ ఆలోచన అని పేర్కొన్నారు. మారుమూల ప్రాంతాల్లో రోడ్డు సౌకర్యాలు, 4జీ నెట్వర్క్ కనెక్టివిటి, ఏకలవ్య విద్యాలయాల సంఖ్యను పెంచాలని కేంద్ర హోంమంత్రిని కోరామన్నారు. మారుమూల ప్రాంతాల అభివృద్ధికి సహాయం చేస్తామని కేంద్ర హోంమంత్రి హామీ ఇచ్చారని సుచరిత చెప్పారు.