గణతంత్ర స్ఫూర్తితో మన్యం అభివృద్ధి

ABN , First Publish Date - 2021-01-27T06:37:24+05:30 IST

గణతంత్ర స్ఫూర్తితో గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కృషిచేస్తామని ఐటీడీఏ పీవో డాక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ అన్నారు. మంగళవారం ఇక్కడ నిర్వహించిన 72వ గణతంత్ర వేడుకల్లో భాగంగా జాతీయ జెండాను ఎగురువేసి, విద్యార్థుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

గణతంత్ర స్ఫూర్తితో మన్యం అభివృద్ధి
విద్యార్థుల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తున్న పీవో వెంకటేశ్వర్‌


రిపబ్లిక్‌ వేడుకల్లో ఐటీడీఏ పీవో వెంకటేశ్వర్‌ 

పాడేరు, జనవరి 26: గణతంత్ర స్ఫూర్తితో గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కృషిచేస్తామని ఐటీడీఏ పీవో డాక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ అన్నారు. మంగళవారం ఇక్కడ నిర్వహించిన 72వ గణతంత్ర వేడుకల్లో భాగంగా జాతీయ జెండాను ఎగురువేసి, విద్యార్థుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఏజెన్సీలో పీహెచ్‌సీల ఆధునికీకరణ జరుగుతున్నదని, కొవిడ్‌-19 ఎదుర్కోడానికి ఏజెన్సీలో 11 క్వారంటైన్‌ సెంటర్లు, రెండు కొవిడ్‌ కేర్‌ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. వీటి ద్వారా రూ.1.2 కోట్లతో బాధితులకు వసతి, పోషకాహార సదుపాయాలు కల్పించామన్నారు. అలాగే 84,432 మందికి కరోనా పరీక్షలు నిర్వహించి, 2,789 మందికి కరోనా సోకినట్టు గుర్తించామని, వారికి మెరుగైన వైద్య సేవలు అందించామన్నారు. భవిష్యత్తులో కొవిడ్‌ రాకుండా వాక్సినేషన్‌ జరుగుతుందన్నారు. ఏజెన్సీలో 367 పాఠశాలలను రూ.104.54 కోట్లతో అభివృద్ధి పరుస్తున్నట్టు చెప్పారు. అటవీ హక్కుల చట్టం కింద 51,683 మంది గిరిజనులకు 86,473 ఎకరాలపై హక్కులు కల్పించామన్నారు. ఇంటింటికీ రేషన్‌ పంపిణీ చేయడానికి అవసరమైన చర్యలు చేపట్టామని, 60 శాతం రాయితీపై రూ.5.5 కోట్లతో 158 మంది గిరిజన నిరుద్యోగ యువతకు మినీ ట్రక్కులను పంపిణీ చేశామన్నారు. అలాగే ప్రత్యేక కేంద్ర సహాయం పఽథకం కింద రూ.75.47 కోట్లతో 196 అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. రూ.55 కోట్లతో ఆశ్రమ పాఠశాలల అభివృద్ధి, తారురోడ్ల నిర్మాణాలు చేపడుతున్నామన్నారు. అలాగే ఉపాధి హామీ పఽథకంలో రూ.150.80 కోట్లతో 212 సచివాలయ భవనాలు, 209 రైతు భరోసా కేంద్రాలు, 139 వైఎస్‌ఆర్‌ హెల్త్‌ క్లీనిక్‌ భవనాలను నిర్మిస్తున్నామన్నారు. అలాగే వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా చేపడుతున్న పథకాల ప్రగతిని పీవో వెంకటేశ్వర్‌ వివరించారు. గణతంత్ర వేడుకల్లో భాగంగా కొయ్యూరు ఆశ్రమ విద్యార్థులు చేసిన బల్లకంబ విన్యాసాలు, స్థానిక తలారిసింగి పాఠశాల విద్యార్థులు చేసిన ఫైర్‌ జంప్‌ అందర్నీ ఆకట్టుకున్నాయి. అనంతరం వంద మంది అధికారులు, ఉద్యోగులకు ఐటీడీఏ పీవో వెంకటేశ్వర్‌ ప్రశంసాపత్రాలు అందించారు. 

Updated Date - 2021-01-27T06:37:24+05:30 IST