పలు రైళ్లు రీ షెడ్యూల్‌

ABN , First Publish Date - 2021-06-19T05:52:39+05:30 IST

విజయనగరం, కోరుకొండ స్టేషన్ల మధ్య ఈ నెల 21న పరిమిత ఎత్తు సబ్‌ వే నిర్మాణ పనులు చేపట్టనున్న నేపథ్యంలో విశాఖ మీదుగా నడిచే పలు ప్రత్యేక రైళ్లను ఈ నెల 20న (ఒక రోజు) రీ షెడ్యూల్‌ చేసినట్టు వాల్తేరు డివిజన్‌ సీనియర్‌ డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు.

పలు  రైళ్లు రీ షెడ్యూల్‌

విశాఖపట్నం, జూన్‌ 18: విజయనగరం, కోరుకొండ స్టేషన్ల మధ్య ఈ నెల 21న పరిమిత ఎత్తు సబ్‌ వే నిర్మాణ పనులు చేపట్టనున్న నేపథ్యంలో విశాఖ మీదుగా నడిచే  పలు ప్రత్యేక రైళ్లను ఈ నెల 20న (ఒక రోజు) రీ షెడ్యూల్‌ చేసినట్టు వాల్తేరు డివిజన్‌ సీనియర్‌ డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు. 

సికింద్రాబాద్‌లో సాయంత్రం 4:30 గంటలకు బయలుదేరాల్సిన సికింద్రాబాద్‌-భువనేశ్వర్‌(07516) ఎక్స్‌ప్రెస్‌ రాత్రి 8:05 గంటలకు(మూడు గంటల 35 నిమిషాలు ఆలస్యంగా) బయలుదేరనుంది. చెన్నై సెంట్రల్‌లో రాత్రి 7:15 గంటలకు బయలుదేరాల్సిన చెన్నై-హౌరా ఎక్స్‌ప్రెస్‌(02822) రాత్రి 9:30 గంటలకు (రెండు గంటల 15 నిమిషాలు ఆలస్యంగా) బయలుదేరనుంది. వాస్కోడిగామలో ఉదయం 6:30 గంటలకు బయలుదేరాల్సిన వాస్కోడిగామ-హౌరా ప్రత్యేక రైలు(08048) ఉదయం 8:45 గంటలకు (రెండు గంటల 15 నిమిషాలు ఆలస్యంగా) బయలుదేరనుంది. గుంటూరులో రాత్రి 11:20 గంటలకు బయలుదేరాల్సిన గుంటూరు-రాయగడ(07243) ఎక్స్‌ప్రెస్‌ అర్ధరాత్రి 12:20 గంటలకు(గంట ఆలస్యంగా) బయలుదేరనుంది. హౌరాలో రాత్రి 11:00 గంటలకు బయలుదేరాల్సిన హౌరా-యశ్వంత్‌పూర్‌(02873) ప్రత్యేక రైలు  అర్ధ్దరాత్రి 12:00 గంటలకు (గంట ఆలస్యంగా) బయలుదేరనుంది. 




Updated Date - 2021-06-19T05:52:39+05:30 IST