Advertisement
Advertisement
Abn logo
Advertisement
Jul 17 2021 @ 12:20PM

అనుమానాస్పద స్థితిలో 16 మంది మృతి... దర్యాప్తు చేపట్టిన పోలీసులు!

పశ్చిమ చంపారణ్: బీహార్‌లోని పశ్చిమ చంపారణ్ జిల్లాలో ఏకంగా 16 మంది అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం సంచలనంగా మారింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఉదంతంతో సంబంధం ఉందని భావిస్తున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. 

మీడియాకు అందిన సమాచారం ప్రకారం పశ్చిమ చంపారణ్‌లో రెండు రోజుల వ్యవధిలో అనుమానాస్పద స్థితిలో 16 మంది మృత్యువాత పడ్డారు. దీంతో అధికారులు హడలెత్తపోయారు. అధికారి కుందన్ కుమార్ దీనిపై స్పందిస్తూ గ్రామంలోని మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడామని, కల్తీ కల్లు కారణంగా ఈ ఉదంతం చోటుచేసుకోలేదని స్పష్టమయ్యిందన్నారు. దీంతో ఈ ఘటనపై మరింతగా దర్యాప్తు చేపట్టాల్సివుందన్నారు. ఈ ఘటనపై ఉపముఖ్యమంత్రి రేణుదేవి మాట్లాడుతూ పశ్చిమ చంపారణ్ జిల్లాలో చోటుచేసుకున్న అనుమానాస్పద మరణాల గురించి తమకు తెలిసిందని, దీనిపై దర్యాప్తు ప్రారంభమైందన్నారు. స్థానికులను ప్రశ్నించి వివరాలు తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నామన్నారు.

Advertisement
Advertisement