9 ఏళ్ల క్రితం భార్యకు విడాకులిచ్చిన యువరాజు.. తరువాత తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటూ...

ABN , First Publish Date - 2022-07-11T15:35:17+05:30 IST

మనదేశపు తొలి స్వలింగ సంపర్కుడు మన్వేంద్ర సింగ్ గోహిల్...

9 ఏళ్ల క్రితం భార్యకు విడాకులిచ్చిన యువరాజు.. తరువాత తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటూ...

మనదేశపు తొలి స్వలింగ సంపర్కుడు మన్వేంద్ర సింగ్ గోహిల్ వివాహానికి ప్రభుత్వం నుంచి సర్టిఫికేట్ లభించింది. ఇటీవల, అతను తన గే స్నేహితుడు డిఆండ్రీ రిచర్డ్‌సన్‌ను వివాహం చేసుకున్నారు. ఈ సందర్భంగా తనకు 2013లో పెళ్లయిందని ఓ పోస్ట్‌లో తెలిపారు. మన్వేంద్ర సింగ్ గోహిల్ గత 8 సంవత్సరాలుగా తన స్నేహితుడు డిఆండ్రీ రిచర్డ్‌సన్‌‌తో సహజీవనం చేస్తున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో మ్యారేజ్ సర్టిఫికెట్ పోస్ట్ చేస్తూ తెలియజేశాడు. 


మన్వేంద్ర సింగ్ మాజీ మహారాజా రఘువీర్ సింగ్ రాజేంద్ర సింగ్, రాజ్‌పిప్లా రాచరిక మాజీ రాణి రుక్మిణీ దేవి కుమారుడు. మన్వేంద్రకు ఇంతకుముందే పెళ్లయింది. వైవాహిక జీవితం సంతోషంగా లేకపోవడంతో భార్య నుంచి విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్న తర్వాత సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టి పశ్చాత్తాపాన్ని కూడా వ్యక్తం చేశారు. 12 ఏళ్ల వయసులో స్వలింగ సంపర్కుడి గురించి మొదటిసారిగా మన్వేంద్రకు తెలిసింది. రాజకుటుంబంలో జన్మించిన మన్వేంద్ర సింగ్ తన పాఠశాల విద్యను ముంబై స్కాట్స్ స్కూల్‌లో చదువుకున్నారు. అనంతరం అమృత్‌బెన్ జీవన్‌లాల్ కాలేజ్ ఆఫ్ మిథిబాయి కాలేజీలో చదివారు. 2006లో తొలిసారిగా తాను స్వలింగ సంపర్కుడినని మన్వేంద్ర తెలియజేశారు. దేశంలోని రాయల్ ఫ్యామిలీ నుండి వచ్చిన మొదటి స్వలింగ సంపర్కుడు అతనే. మన్వేంద్ర సింగ్ గోహిల్ స్వలింగ సంపర్కుల హక్కుల కోసం చాలా కాలంగా పోరాడుతున్నారు. ఇందుకోసం తన ప్యాలెస్‌లో గే కమ్యూనిటీ సెంటర్‌ను ప్రారంభించారు. 2018లో సుప్రీంకోర్టు... సెక్షన్ 377ను తొలగించడం ద్వారా స్వలింగ సంపర్క సంబంధాలను నేరాల పరిధిలోకి రావని స్పష్టం చేసింది. 2009లో బీబీసీ 'అండర్ కవర్ ప్రిన్స్' కార్యక్రమంలో మన్వేంద్ర సింగ్ రాజకుటుంబానికి సంబంధించిన విషయాలను బయటపెట్టారు. 2007లోనూ మన్వేంద్ర సింగ్ అమెరికన్ షో 'ది ఒపెరా విన్‌ఫ్రే'లో కనిపించారు.

Updated Date - 2022-07-11T15:35:17+05:30 IST