ఎరువు....అన్నదాతకు బరువు

ABN , First Publish Date - 2021-08-02T06:54:55+05:30 IST

ఉత్పత్తి వ్యయం సాకుతో ఎరువు ల కంపెనీలు ఇష్టారాజ్యంగా కాంప్లెక్స్‌ల ధరలు పెంచి అన్నదాతల నడ్డి విరుస్తున్నాయి.

ఎరువు....అన్నదాతకు బరువు


- పెరిగిన కాంప్లెక్స్‌ ధరలతో ఆర్థిక ఇక్కట్లు

- కర్షకులపై అదనపు భారం

జగిత్యాల, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): ఉత్పత్తి వ్యయం సాకుతో ఎరువు ల కంపెనీలు ఇష్టారాజ్యంగా కాంప్లెక్స్‌ల ధరలు పెంచి అన్నదాతల నడ్డి విరుస్తున్నాయి. 50 కిలోల కాంప్లెక్స్‌ బస్తాకు రూ. 250 నుంచి రూ. 300 వరకు ఇటీవల పెంచేశాయి. వ్యవసాయంలో యే యేటికి ఆ యేడు కాంప్లెక్స్‌ల వినియోగం ఎక్కువవుతుండడంతో ఇదే అదనుగా భావించి న పలు కంపెనీలు వాటిపైనే భారం వేస్తున్నాయి. జగిత్యాల జిల్లాలోని పలు గ్రామాల్లో కాంప్లెక్స్‌ను రైతులు ఎక్కువగా వినియోగిస్తున్నారు. 

సాగవుతున్న పంటలు...

జిల్లాలోని 18 మండలాల్లో గల 380 గ్రామాల్లో ప్రస్తుత వానాకాలం సీజన్‌లో సుమారు 3.65 లక్షల ఎకరాల్లో పంటల సాగు అవుతోంది. ఇం దులో ప్రధానంగా 2.83 లక్షల ఎకరాల్లో వరి, 31 వేల ఎకరాల్లో పత్తి, 15 వేల ఎకరాల్లో కంది, 31 వేల ఎకరాల్లో మొక్కజొన్న, 2,500 ఎకరాల్లో పె సర, 2,500 ఎకరాల్లో ఇతర పంటలు సాగవుతున్నాయి. వీటికి అదనంగా సుమారు 2 లక్షల ఎకరాల్లో వివిధ రకాల ఉద్యానపంటలను అన్నదాత లు సాగు చేస్తున్నారు.

పెరిగిన ధరలతో తిప్పలు....

గతంలో ఎరువు 20.20.0.13 ధర రూ. 975 ఉండగా ప్రస్తుతం రూ. 1,175కు పెంచారు. అదేవిధంగా 12.32.16 ధర రూ. 1,120 నుంచి రూ. 1310కు, 15.15.15. ధర రూ. 1,070 నుంచి రూ. 1,190కు పెరిగింది. 28.28.0 ధర రూ. 1,240 నుంచి రూ. 1,450కు. 14.35.14 ధర 1,275 నుంచి రూ. 1,450కు, 10.26.26 ధర రూ. 1,200 నుంచి రూ. 1,375కు పెరిగింది. దీంతో వ్యవసాయ పెట్టుబడులు పెరుగుతుండడంతో రైతులు లబోదిబోమంటున్నారు. పొటాష్‌ పైనా సైతం కంపెనీలు భారం వేశా యి. సుమారు రూ. 1,500 వరకు పోటాష్‌ ధర పెరిగిందని రైతులు వాపోతున్నారు.

తగ్గిన డీఏపీ వాడకం, పెరిగిన కాంప్లెక్స్‌ వినియోగం....

గత పదేళ్లకిత్రం వరకు రైతులు ఎక్కువగా డీఏపీని వినియోగించే వా రు. డీఏపీ ధరలు భారీగా పెరగడం, కాంప్లెక్స్‌ ధరలు తక్కువగా ఉం డడంతో క్రమంగా డీఏపీ తగ్గించారు. జిల్లాలో వరికి అధిక మొత్తంలో పలు రకాల కాంప్లెక్స్‌ ఎరువులను వినియోగిస్తున్నట్లు అధికారుల అంచ నా ఉంది. ఇదే అదనుగా కాంప్లెక్స్‌ ధరలను కంపెనీలు పెంచినాయని రై తులు వాపోతున్నారు. కంపెనీలు పెంచిన కొత్త ధరలతో వ్యాపారులు కాంప్లెక్స్‌ ఎరువుల విక్రయాలను జరుపుతున్నారు. డీఏపీ ఎరువులకు ప్ర భుత్వం కల్పిస్తున్న 50 శాతం రాయితీ మాదిరిగానే కాంప్లెక్స్‌ ధరలు పె రిగినప్పుడు అంతే మొత్తంలో రాయితీని సర్కారు అధికం చేయాలని రైతులు కోరుతున్నారు.


అధికారుల అంచనా ఇలా....

జగిత్యాల జిల్లాలోని 18 మండలాల్లో గల 380 గ్రామ పంచాయతీల పరిదిలో 2021-22 సంవత్సరంలో 65,201 మెట్రిక్‌ టన్నుల యూరియా అవసరమని అంచనా ఉంది. ఇందులో వానాకాలం సీజన్‌లో 35,155 మె ట్రిక్‌ టన్నుల యూరియా, యాసంగి సీజన్‌లో 30,046 మెట్రిక్‌ టన్నుల యూరియా అవసరమవుతున్నట్లు అధికారులు అంచనా వేశారు. అదేవి ధంగా 6,231 మెట్రిక్‌ టన్నుల డీఏపీ అవసరమని అంచనా ఉండగా ఇం దులో వానాకాలం సీజన్‌లో 3,642 మెట్రిక్‌ టన్నులు, యాసంగి సీజన్‌ లో 3,642 మెట్రిక్‌ టన్నుల డీఏపీ అవసరమవుతున్నట్లు అధికారులు అంచనా వేశారు. 36,225 మెట్రిక్‌ టన్నుల కాంప్లెక్స్‌ అవసరమని అంచ నా ఉండగా ఇందులో వానాకాలం సీజన్‌లో 20,969 మెట్రిక్‌ టన్నులు, యాసంగి సీజన్‌లో 15,256 మెట్రిక్‌ టన్నుల కాంప్లెక్స్‌ ఎరువులు రైతుల కు అవసరమవుతున్నట్లు అధికారులు అంచనా వేశారు. జిల్లాలోని రైతు లకు ఎంఓపీ, ఎస్‌ఎస్‌పీ 1,14,030 మెట్రిక్‌ టన్నులు అవసరముండగా  వానాకాలంలో 62,115 మెట్రిక్‌ టన్నులు, యాసంగిలో 51,915 మెట్రిక్‌ టన్నులు అవసరమన్న అంచనా ఉంది. ఇందులో ఎంఓపీ 5,667 మెట్రిక్‌ టన్నులు కాగా వానాకాలంలో 2,115 మెట్రిక్‌ టన్నులు, యాసంగిలో 3,552 మెట్రిక్‌ టన్నులు అవసరముంది. అదేవిదంగా ఎస్‌ఎస్‌పీ 706 మె ట్రిక్‌ టన్నులు అవసరముండగా వానాకాలంలో 234 మెట్రిక్‌ టన్నులు, యాసంగి 472 మెట్రిక్‌ టన్నులు అవసరముందని అధికారులు అంచనా వేశారు.

ధరలపై నియంత్రణ ఉంచాలి

- అల్లూరి మహేందర్‌ రెడ్డి, సింగిల్‌ విండో మాజీ చైర్మన్‌

కాంప్లెక్స్‌ ధరల పెరుగుదలపై ప్రభుత్వం నియంత్రణ ఉంచాలి. కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలి. ఎరువు కాంప్లెక్స్‌ ధరలను కంపెనీలు పెంచడం వల్ల రైతులకు వ్యవ సాయ పెట్టుబడులు మరింత పెరుగుతున్నాయి. వ్యవసాయంలో పెరు గుతున్న ఆర్థిక భారాన్ని రైతు భరిస్తుండడం ఇబ్బందికరంగా మారుతోంది.


Updated Date - 2021-08-02T06:54:55+05:30 IST