మణుగూరులో ‘భూ’చోళ్లు

ABN , First Publish Date - 2020-07-08T10:12:13+05:30 IST

ఏ కాస్త ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు కబ్జాదారులు రెక్కలు కట్టుకుని వాలిపోతారక్కడ. అలాంటిది ఏకంగా ప్రధాన రహదారిపక్కనే ..

మణుగూరులో ‘భూ’చోళ్లు

సర్కారు భూమి దర్జాగా కబ్జా

విలువ రూ. కోటి పై మాటే

కోర్టు స్టే ఉన్నా ఖాతరు చేయని వైనం

చేష్టలుడిగి చూస్తున్న రెవెన్యూ యంత్రాంగం

పనులు నిలిపేయించాం: ఆంధ్రజ్యోతితో తహసీల్దార్‌


మణుగూరురూరల్‌, జూలై 7: ఏ కాస్త ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు కబ్జాదారులు రెక్కలు కట్టుకుని వాలిపోతారక్కడ. అలాంటిది ఏకంగా ప్రధాన రహదారిపక్కనే సుమారు పది సెంట్ల స్థలం ఖాళీగా ఉంటే ఊరుకుంటారా? ప్రజాప్రతినిధుల అండదండలతో పది సెంట్ల స్థలాన్ని కబ్జా చేసేందుకు రంగం సిద్ధం చేశా రు. ఆ స్థలంలో ఉన్న ఓ రెకుల షెడ్డును నేలమట్టం చేసి చదును చేశారు. ఆ స్థలంపై కోర్టులో కేసు నడుస్తోంది. దాని పై స్టే ఉండటంతో ఇన్నాళ్లూ ఎటువంటి ప్రభుత్వ కట్టడాలకు వినియోగించలేదు. ఆదివాసీ సంఘాల నాయకులు తాము దివాసీ భవన్‌ నిర్మించుకుంటామన్నా తహసీల్దార్లు కోర్టు సాకు చూపారు. ఇప్పు డు ఎవరో ఆక్రమణకు ప్రయత్నిస్తుంటే మాత్రం అధికారులు చూసిచూడనుట్లు వ్యవహరిస్తున్నారు. ఆ స్థలం విలువ ప్రస్తుత మణుగూరు మార్కెట్‌ ధరల ప్రకా రం రూ.కోటికి పైగా ఉంది.


కబ్జాకు రంగం సిద్ధం

 మణుగూరు పట్టణంలోని అశోక్‌నగర్‌ ప్రాంతంలోని 138 సర్వే నంబర్‌లోని పాత సీఆర్‌పీఎఫ్‌ క్యాంపు కార్యాలయం ఉన్న ప్రాంతంలో సుమారు పది సెంట్ల స్థలం ఖాళీగా ఉంది. సీఆర్‌పీఎఫ్‌ క్యాంపు ఎత్తివేసిన తర్వాత ఖాళీగా ఉన్న ఆ ప్రభుత్వ స్థలంలో కోర్టు భవనానికి స్థలం, ప్రాఽథమిక పాఠశాల నిర్మించిన తర్వాత ప్రధాన రహదారిని ఆనుకుని సుమారు పది సెంట్ల స్థలం మిగిలింది. ఈ స్థలంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో అతి తక్కువ ధరకే ప్యూరిఫైడ్‌ వాటర్‌ సరఫరా చేసేందుకు ఓ గిరిజనుడు అనుమతి తెచ్చుకున్నాడు. ప్లాంట్‌ నిర్మాణం కో సం ఆ పది సెంట్ల స్థలాన్ని కేటాయించినట్లు సమాచారం. ప్లాంట్‌ నిర్మాణం కోసం షెడ్‌ నిర్మించిన గిరిజనుడు తర్వాత మానుకున్నాడు. తర్వాత వ్యాపారం చేసేం దుకు ముందుకొచ్చాడు. అయితే ఆర్‌డబ్ల్యూఎస్‌, పంచాయతీ అధికారులు అభ్యం తరం వ్యక్తం చేశారు.


అధికారులు జోక్యం చేసుకుంటున్నారంటూ అనుమతి ని తెచ్చుకున్న గిరిజనుడు ఆ స్థలం తనకు కేటాయించాలంటూ 2010లో కోర్టును ఆశ్రయించాడు. కోర్టు స్టే ఆర్డర్‌ ఇచ్చింది. పదేళ్లుగా ఆ స్థలాన్ని ఎవరూ పట్టించుకోకపోవడంతో కబ్జాదారుల కన్ను దానిపై పడింది. వెంటనే షెడ్డును కూల్చి స్థలాన్ని చదును చేశారు. నిర్మాణాన్ని చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఇంత జరుగుతున్నా  అధికారులు పట్టించుకోకపోవడం పట్ల పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చే స్తున్నారు.


పనులను నిలిపివేశాం: తహసీల్దార్‌ లూథర్‌ విల్సన్‌

అశోక్‌నగర్‌లోని పది సెంట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతున్న విషయంపై తహసీల్దార్‌ లూథర్‌ విల్సన్‌ను ఆంధ్రజ్యోతి వివరణ కోరగా.. నిర్మాణ పనులను నిలిపివేశామని, ఆ స్థలానికి సంబంధించిన ధృవ పత్రాలను తీసుకురావాలని ఇ రు వర్గాలకు తెలిపామన్నారు. పత్రాలు సక్రమంగా లేకపోతే భూమిని స్వాధీనం చేసుకుని ప్రభుత్వ కట్టడాలకు వినియోగిస్తామన్నారు.

Updated Date - 2020-07-08T10:12:13+05:30 IST