Oct 20 2021 @ 03:45AM

మనుచరిత్ర ముగిసింది

శివ కందుకూరి, మేఘా ఆకాష్‌ జంటగా నటిస్తున్న ‘మనుచరిత్ర’ చిత్రం షూటింగ్‌ పూర్తయింది. మంగళవారం చిత్రబృందం ఈ విషయాన్ని ప్రకటించింది. యువతీ యువకుల ప్రేమలో సరికొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ గాఢమైన ప్రేమకథతో ఈ చిత్రం తెరకెక్కినట్టు యూనిట్‌ తెలిపింది. హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ సమర్పణలో ఎన్‌. శ్రీనివాసరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. భరత్‌ పెదగాని దర్శకుడిగా పరిచయమవుతున్నారు. గోపీసుందర్‌ సంగీత దర్శకుడు. ప్రియా వడ్లమాని కీలకపాత్ర పోషిస్తున్నారు.