Abn logo
Jul 23 2021 @ 00:38AM

మాన్‌సూన్‌ ఎమర్జెన్సీ కంట్రోల్‌రూమ్‌ల ఏర్పాటు

మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటిస్తున్న జోనల్‌ కమిషనర్‌ అశోక్‌ సామ్రాట్‌, ఇతర అధికారులు

మదీన, జూలై 22(ఆంధ్రజ్యోతి): వర్షాకాలంలో ఎదురయ్యే సమస్యలపై తక్షణమే స్పందించేందుకు సర్కిళ్ల వారీగా మాన్‌సూన్‌ ఎమర్జెన్సీ కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశామని జీహెచ్‌ఎంసీ చార్మినార్‌ జోన్‌ జోనల్‌ కమిషనర్‌ అశోక్‌ సామ్రాట్‌ తెలిపారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో గురువారం జోనల్‌ కమిషనర్‌ మలక్‌పేట్‌, చాంద్రాయణగుట్ట, రాజేంద్రనగర్‌ సర్కిళ్ల పరిఽధిలోని మూసీ పరీవాహక ప్రాంతం, గుర్రంచెరువు, గగన్‌పహాడ్‌ అప్పచెరువు, శివరాంపల్లి తదితర ప్రాంతాల్లో డిప్యూటీ కమిషనర్లు, ఇతర అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా జోనల్‌ కమిషనర్‌ మాట్లాడుతూ, భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో ఎదురయ్యే సమస్యలు, శిథిలావస్థకు చేరుకుని కూలడానికి సిద్ధంగా ఉన్న భవనాలు, రోడ్లపై వర్షపు నీరు, డ్రైనేజీ మ్యాన్‌హోల్‌ సమస్యలపై ఎమర్జెన్సీ కంట్రోల్‌ రూమ్‌లో సంప్రదించాలన్నారు. కూలడానికి సిద్ధంగా ఉన్న భవనాలను గుర్తించి ఇప్పటికే నోటీసులు జారీ చేశామన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సర్కిళ్లవారీగా కంట్రోల్‌ రూమ్‌ నెంబర్లు: మలక్‌పేట్‌ సర్కిల్‌-7995085322, సంతో్‌షనగర్‌ సర్కిల్‌-7673951166, చాంద్రాయణగుట్ట సర్కిల్‌-7287952917, చార్మినార్‌ సర్కిల్‌ -9346497855, ఫలక్‌నుమా సర్కిల్‌-9030814363, రాజేంద్రనగర్‌ సర్కిల్‌-8106561415.