Chitrajyothy Logo
Advertisement
Published: Sun, 10 Oct 2021 16:53:23 IST

వాటమ్మా, వాటీజ్ దిస్ అమ్మా?!

twitter-iconwatsapp-iconfb-icon
వాటమ్మా, వాటీజ్ దిస్ అమ్మా?!

‘మా’దంతా ఒకే కుటుంబం. మేమంతా కళాకారులం. ఇలాంటి మాటలు మనకు కొత్తేం కాదు. చాలా సార్లు టాలీవుడ్ సెలబ్రిటీలు చెబుతూనే ఉంటారు. అయితే, ‘మా’ ఎన్నికల సందర్భంగా గత కొద్ది రోజులుగా తీవ్రంగా వేడి రాజుకుంది. ఒకవైపు విష్ణు వర్గం, మరోవైపు ప్రకాశ్ రాజ్ వర్గం బలంగా మోహరించాయి. విమర్శలు, ప్రతి విమర్శలు ఎడతెరిపి లేకుండా సాగాయి. కానీ, తీరా సీన్ ఎన్నికల ఓటింగ్ వద్దకొచ్చే సరికి... కూల్‌గా మారిపోయింది. విష్ణు, ప్రకాశ్ రాజ్ సెల్ఫీ ఫోటోను సొషల్ మీడియాలోకి వదిలారు! చాలా మంది ఆశ్చర్యపోక తప్పని పరిస్థితి ఎదురైంది! 


ప్రకాశ్ రాజ్‌తో మంచు విష్ణు సెల్ఫీ తీసుకుని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దాని ద్వారా ఆయన తామంతా ఒక్కటే అన్న సందేశం ఇవ్వాలనుకున్నారేమో. గొడవలు, విమర్శలు అన్నీ ఎన్నికల వరకే పరిమితం అని చెప్పకనే చెప్పారు విష్ణు. కానీ, నెటిజన్స్ ఒకింత నెగటివ్‌గానే స్పందించారు. రోజుల తరబడి మీడియాలో మాటల యుద్ధం చేసి... ఇప్పుడిదేంటంటూ కామెంట్స్ చేశారు.


ప్రకాశ్ రాజ్, విష్ణు ఫోటోకు సామాన్యుల స్పందన పక్కన పెడితే, మోహన్ బాబు మరో వారసుడు, మనోజ్ రియాక్షన్ అందర్నీ అవాక్కయ్యేలా చేసింది. ‘వాటమ్మా, వాటీజ్ దిస్ అమ్మా?!’ అని సరదాగా వ్యాఖ్యానించారు మనోజ్. ప్రకాశ్ రాజ్‌తో అన్న విష్ణు కలసి తీసుకున్న సెల్ఫీని కూడా ఆయన పోస్ట్ చేశారు. మంచు మనోజ్ ట్విట్టర్ పోస్టుకు కూడా భారీగా కామెంట్స్ వచ్చాయి. చాలా మంది ప్రకాశ్, విష్ణుల ఫోటో పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇంకొందరు మనోజ్ రియాక్షన్ను మెచ్చుకున్నారు. ఇక కొందరైతే ‘‘విష్ణుని మనోజే ఇలా ట్రోల్ చేస్తే ఎలా?’’ అన్నారు!    


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement