Oct 27 2021 @ 14:08PM

Rajinikanth జీవితం ఎంతో మందికి స్ఫూర్తి: మనోజ్ బాజ్‌పాయ్

తన అద్భుత నటనతో ఉత్తరాది వారినే కాదు.. దక్షిణాది ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంటున్నాడు నటుడు మనోజ్ బాజ్‌పాయ్. భోంశ్లే (2018)లో తన నటనకు గానూ మనోజ్ తాజాగా మూడోసారి జాతీయ అవార్డు అందుకున్నాడు. అంతకు ముందు సత్య (1998), పింజర్ (2003) సినిమాలకుగానూ జాతీయ అవార్డులు దక్కించుకున్నాడు. తాజాగా జరిగిన అవార్డుల వేడుకలో సౌత్ సూపర్‌స్టార్ రజినీకాంత్, ఆయన అల్లుడు, తమిళ ప్రముఖ నటుడు ధనుష్ కూడా అవార్డులు అందుకున్న సంగతి తెలిసిందే. 


ఈ నేపథ్యంలో రజినీకాంత్‌, ధనుష్‌తో మనోజ్ కొద్ది సమయం గడిపాడు. వారి గురించి మీడియాతో మాట్లాడాడు. `రజినీకాంత్ సర్ ఓ దిగ్గజం. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలోకి ప్రవేశించి ఎంతో ఎత్తుకు ఎదిగిన రజినీ జీవితం అందరికీ స్ఫూర్తిగా నిలుస్తుంది. స్టార్‌ననే గర్వం లేకుండా ఆయన అందరితోనూ చాలా చక్కగా కలిసిపోతారు. తాజాగా జరిగిన కార్యక్రమంలో ఆయనతో ఎన్నో విషయాలు మాట్లాడాను. అయితే అవేవీ సినిమాకు సంబంధించినవి కాదు.. ఆధ్యాత్మికత గురించే ఎక్కువగా మాట్లాడుకున్నామ`ని మనోజ్ చెప్పాడు. అలాగే ధనుష్ నటన తనకు చాలా నచ్చుతుందని, అతడి సినిమాల గురించి ఎన్నో విషయాలు చర్చించుకున్నామని మనోజ్ తెలిపాడు. 

Bollywoodమరిన్ని...