మెదక్: మనోహరాబాద్ ఎంపీడీవో జైపాల్‌రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. ఈ కేసులో జైపాల్‌రెడ్డిని అరెస్ట్ చేసి ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చారు. కోర్టు రిమాండ్ విధించింది. దీంతో ఆయనను జైలుకు తరలించారు.
కాగా మనోహరాబాద్ ఎంపీడీవో జైపాల్‌రెడ్డి ఇంట్లో మంగళవారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. సుమారు 3.40 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. 3 బ్యాంక్ లాకర్లు సీజ్ చేశారు. స్వచ్ఛంద పదవీ విరమణకు ఆరు నెలల క్రితం జైపాల్‌రెడ్డి దరఖాస్తు చేశారు. ఈ దరఖాస్తును ఉన్నతాధికారులు పెండింగ్‌లో ఉంచారు.
ఇవి కూడా చదవండి