కేజ్రీవాల్‌కు పాదాభివందనం చేసిన భగవంత్ మాన్

ABN , First Publish Date - 2022-03-12T00:02:53+05:30 IST

117 అసెంబ్లీ స్థానాలున్న పంజాబ్‌లో ఆప్ ఏకంగా 92 స్థానాలు గెలుచుకుని ఘన విజయం సాధించింది. గత ఎన్నికల్లో 20 స్థానాలతో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కించుకున్న ఆప్.. కేవలం ఐదేళ్లలో ఇంత పెద్ద విక్టరీ సాధించడంపై..

కేజ్రీవాల్‌కు పాదాభివందనం చేసిన భగవంత్ మాన్

న్యూఢిల్లీ: పంజాబ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న భగవంత్ మాన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు పాదాభివందనం చేశారు. గురువారం విడుదలైన ఫలితాల్లో పంజాబ్‌లో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా, ఈ ఫలితాల అనంతరం కేజ్రీవాల్‌ను కలిసేందుకు ఆయన శుక్రవారం ఢిల్లీకి వెళ్లారు. కేజ్రీవాల్‌ను సమీపిస్తూనే పాదాభివందనం చేశారు. అనంతరం మాన్‌ను కేజ్రీవాల్ ఆత్మీయంగా ఆళింగనం చేసుకున్నారు. ఇక ఆప్‌లో టాప్-2 గా ఉన్న మనీశ్ సిసోడియా పాదాలకు కూడా మాన్ నమస్కరించారని సమాచారం.


117 అసెంబ్లీ స్థానాలున్న పంజాబ్‌లో ఆప్ ఏకంగా 92 స్థానాలు గెలుచుకుని ఘన విజయం సాధించింది. గత ఎన్నికల్లో 20 స్థానాలతో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కించుకున్న ఆప్.. కేవలం ఐదేళ్లలో ఇంత పెద్ద విక్టరీ సాధించడంపై హర్షాతికేరాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక భగవంత్ మాన్ మార్చి 16న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఈ ప్రమాణ స్వీకారం రాజ్‌భవన్‌లో కాకుండా భగత్‌సింగ్ స్వగ్రామమైన ఖత్కర్ ఖాట్‌లో చేయనున్నారు.

Updated Date - 2022-03-12T00:02:53+05:30 IST