మన్మోహన్‌కు డెంగ్యూ, నిలకడగా ఆరోగ్యం

ABN , First Publish Date - 2021-10-17T00:39:58+05:30 IST

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్ డెంగ్యూ బారిన పడినట్టు వైద్య పరీక్షల్లో నిర్ధారణ ..

మన్మోహన్‌కు డెంగ్యూ, నిలకడగా ఆరోగ్యం

న్యూఢిల్లీ : మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్ డెంగ్యూ బారిన పడినట్టు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయింది. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతున్నట్టు ఎయిమ్స్ అధికారులు శనివారంనాడు తెలిపారు. జ్వరం, నీరసం కారణంగా 89 ఏళ్ల మన్మోహన్ గత బుధవారం సాయంత్రం ఆసుపత్రిలో చేరారు. వైద్య పరీక్షల్లో ఆయనకు డెంగ్యూ అని తేలిందని, ప్రస్తుతం ఆయనలో ప్లేట్‌లెట్స్ కౌంట్ పెరిగిందని, పరిస్థితి మెరుగుపడిందని ఆసుపత్రి అధికారి ఒకరు తెలిపారు.


ఫోటోగ్రాఫర్‌తో వెళ్లిన కేంద్ర మంత్రి..

కాగా, మన్మోహన్ సింగ్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు గత గురువారంనాడు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్షుక్ మాండవీయ ఒక ఫోటోగ్రాఫర్‌ను తీసుకుని ఆసుపత్రికి వెళ్లడం విమర్శలకు దారితీసింది. మంత్రితో పాటు ఒక ఫోటోగ్రాఫర్ గదిలోకి అడుగుపెట్టడంపై తన తల్లి అసంతృప్తి వ్యక్తం చేశారని, దాంతో ఆ ఫోటోగ్రాఫర్ గది నుంచి బయటుక వెళ్లిపోయారని మన్మోహన్ కుమార్తె దామన్ సింగ్ పేర్కొన్నట్టు వార్తలు వచ్చాయి. ''అమ్మ చాలా మనస్తాపానికి గురైంది. నా తల్లిదండ్రులు వయోవృద్ధులు. జూలో జంతువులు కాదు'' అని దామన్ సింగ్ వాపోయినట్టు తెలుస్తోంది.

Updated Date - 2021-10-17T00:39:58+05:30 IST