అన్నా చెల్లెల మధ్య అనుబంధం, ప్రేమలను తెలియజేసే పండుగ రక్షాబంధన్. ఈ సందర్భంగా సినీ సెలబ్రిటీలు పలువురు ప్రేక్షకులకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో మహేశ్ సోదరి, నిర్మాత, దర్శకురాలు మంజుల ఘట్టమనేని ట్విట్టర్ ద్వారా తన సోదరులు రమేశ్‌బాబు, మహేశ్‌లకు శుభాకాంక్షలను తెలియజేశారు. ‘‘కొన్ని బంధాలు విలువైనవి. తోబుట్టువులతో కలిసి పెరగడం అద్భుతమైన ఆనందం. గొడవలు పడుతాం, ఒకరిమీద ఒకరం అభిమానం చూపించుకుంటాం. నా తోబుట్టువులకు రక్షాబంధన్ శుభాకాంక్షలు’’ అని తెలియజేస్తూ మహేష్‌బాబు, రమేష్‌బాబు కలిసి ఉన్న ఫొటోలను పోస్ట్ చేశారు మంజుల.