Jun 20 2021 @ 23:14PM

‘అల వైకుంఠపురంలో’ మనీషా?

తెలుగు సినిమాల మార్కెట్‌ పెరగడంతో టాలీవుడ్‌లో హిట్‌ చిత్రాలపై  పరభాష మేకర్‌ల దృష్టి పడుతుంది. సక్సెస్‌ అయిన తెలుగు చిత్రాలను ఇతర భాషల్లో రీమేక్‌ అవుతున్నాయి. టాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్‌ సినిమా ‘అల వైకుంఠపురంలో’ చిత్రం హిందీలో రీమేక్‌ అవుతున్న సంగతి తెలిసిందే.  డేవిడ్‌ ధావన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కార్తీక్‌ ఆర్యన్‌ హీరోగా నటించనున్నారు. తెలుగులో టబు పోషించిన పాత్రను బాలీవుడ్‌లో మనీషా కోయిరాల చేయనున్నారనే వార్త బాలీవుడ్‌లో చక్కర్లు కొడుతుంది. మేకర్స్‌ ఆమెను సంప్రదించగా మనీషా అంగీకరించినట్లు సమాచారం. త్వరలోనే అధికారికంగా ప్రకటన రానుందని తెలుస్తోంది.