Manipurలో కొండచరియలు విరిగిపడి 81 మంది మృతి

ABN , First Publish Date - 2022-07-02T13:52:53+05:30 IST

మణిపూర్‌లో కొండచరియలు విరిగిపడి 81 మంది మృతి చెందారు...

Manipurలో కొండచరియలు విరిగిపడి 81 మంది మృతి

మణిపూర్ : మణిపూర్‌లో కొండచరియలు విరిగిపడి 81 మంది మృతి చెందారు.మణిపూర్ రాష్ట్ర చరిత్రలోనే అత్యంత దారుణమైన ఈ ఘటన జరిగిందని ఆ రాష్ట్ర సీఎం ఎన్‌బీరెన్‌ అన్నారు.కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ మణిపూర్ చరిత్రలో కొండచరియలు విరిగిపడటం అత్యంత దారుణమైన సంఘటనగా పేర్కొన్నారు. పేరుకుపోయిన మట్టి కారణంగా మృతదేహాలను వెలికి తీయడానికి రెండు మూడు రోజుల సమయం పడుతుందని బీరెన్ చెప్పారు. మణిపూర్‌లోని టుపుల్ వద్ద శుక్రవారం కొండచరియలు విరిగిపడిన సంఘటన స్థలం నుంచి సెర్చ్ ఆపరేషన్‌లో 8మంది ఆర్మీ సిబ్బంది,నలుగురు పౌరులతో సహా మరో 12 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని భారత సైన్యం తెలిపింది.


జిరిబామ్ నుంచి ఇంఫాల్ వరకు నిర్మాణంలో ఉన్న రైల్వే లైన్ రక్షణ కోసం టుపుల్ రైల్వే స్టేషన్ సమీపంలో మోహరించిన భారత సైన్యం వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి.ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి.  దీనివల్ల జిరిబామ్ - ఇంఫాల్ కొత్త లైన్ ప్రాజెక్ట్ టుపుల్ స్టేషన్ భవనానికి నష్టం వాటిల్లిందని నార్త్-ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే సీసీఆర్‌ఓ తెలిపారు.రెస్క్యూ ఆపరేషన్ కోసం కేంద్రం ఎన్డీఆర్ఎఫ్,ఆర్మీ సిబ్బందిని కూడా పంపింది. మణిపూర్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఏర్పడిన కొండచరియల పరిస్థితిని మంత్రి నరేంద్ర మోడీ గురువారం ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్‌తో సమీక్షించారు. కేంద్రం నుంచి సాధ్యమైన సహాయం చేస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. 


Updated Date - 2022-07-02T13:52:53+05:30 IST