పింఛన్‌ పంపిణీలో అవకతవకలు

ABN , First Publish Date - 2022-05-21T05:34:18+05:30 IST

బేల మండలంలోని చప్రాల గ్రామంలో వృద్ధాప్య పింఛన్ల పంపిణీలో అవకతవకలు జరిగాయి. పింఛన్‌ మంజూరైన వారి పేరిటా భీనామి వ్యక్తికి నాలుగేళ్ల నుంచి పంచాయతీ కార్యదర్శి, పోస్టల్‌ సిబ్బంది పింఛన్‌ డబ్బులు అందజేశారు.

పింఛన్‌ పంపిణీలో అవకతవకలు

బేల, మే20: బేల మండలంలోని చప్రాల గ్రామంలో వృద్ధాప్య పింఛన్ల పంపిణీలో అవకతవకలు జరిగాయి. పింఛన్‌ మంజూరైన వారి పేరిటా భీనామి వ్యక్తికి నాలుగేళ్ల నుంచి పంచాయతీ కార్యదర్శి, పోస్టల్‌ సిబ్బంది పింఛన్‌ డబ్బులు అందజేశారు. 2018 పెందూరు జంగు అనే ఆదివాసీ పేరిట వృద్ధాప్య పింఛన్‌ మంజూరైంది. కానీ పంచాయతీ కార్యదర్శి, పోస్టల్‌ సిబ్బంది  నిర్లక్ష్యం కారణంగా అందకుండా పోయింది. ఇతని పింఛన్‌ అదే గ్రామానికి చెందిన మెస్రం జంగు అనే ఆదివాసీకి అందజేశారు. కనీసం ఆధార్‌కార్డు నెంబర్‌ చూడకుండా ఇతరులకు అందజేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాలుగు సంవత్సరాలుగా బినామీకి పింఛన్‌ అందజేస్తున్నారు. రూ.లక్షన్నర వరకు పింఛన్‌ డబ్బులు స్వాహా అయ్యాయి. ఈ వ్యవహారం అంతా పెందూరు జంగు మృతి చెందడంతో అక్రమాలు బయట పడ్డాయి. జంగుకు వృద్ధాప్య పింఛన్‌ వస్తుంది. రైతు బీమాకు అనర్హుడు అని వ్యవసాయ శాఖ అధికారులు తెలుపడంతో అందరు అవాక్కయ్యారు. బినామీ పేరిట పింఛన్‌ అందజేశారు అనే విషయం తెలిసింది. ఈ విధంగా అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఓ ఆదివాసీ నాలుగేళ్లు పింఛన్‌ డబ్బులు నష్టపోయాడు. వయస్సు ఎక్కువ ఉందనే కారణంగా రైతు బీమా పేద కుటుంబానికి అందకుండా పోయింది.

Updated Date - 2022-05-21T05:34:18+05:30 IST