Abn logo
Sep 20 2021 @ 00:41AM

ఓట్ల లెక్కింపులో అవకతవకలు

బీజేపీ జిల్లా అధ్యక్షుడు అట్టాడ రవిబాబ్జీ

గుజరాతీపేట: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగా యని బీజేపీ జిల్లా అధ్యక్షుడు అట్టాడ రవిబాబ్జీ ఒక ప్రకటనలో ఆరోపించారు. ఎన్నికల అధికారులు అధికార పార్టీతో కలిసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారన్నారు. అనేక చోట్ల బీజేపీ, ఇతర పార్టీల అభ్య ర్థుల ఏజెంట్లను అధికారులు, పోలీ సులు బలవంతంగా బయటకు పంపేశారన్నారు. బీజేపీ ఓట్ల కట్టలను వేరే ఓట్లతో కలిపి లెక్కచూపారన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పా రు. టెక్కలి మండలం తొలిసూరుపల్లిలో బీజేపీ ఎంపీటీసీ అభ్యర్థికి ఒకటి, రెండు రౌండ్లలో 75 పైచిలుకు ఓట్లు వస్తే.. అధికారులు బీజేపీ, టీడీపీ ఏజెంట్లను బలవంతంగా బయ టకు పంపించేసి జీరో ఓట్లను చూ పారని ఆరోపించారు. ఇచ్ఛాపురం మండలం బిర్లంగి-తోటూరు ఎం పీటీసీగా బీజేపీ అభ్యర్థి గెలు పొందితే రెండో స్థానంగా చూపించారన్నారు.  ఈ విషయా న్ని  ఉన్నతాధికారులు, రాష్ట్ర ఎన్ని కల కమిషనర్‌(ఎస్‌ఈసీ) దృష్టికి తీసుకువెళ్తానని ఆయన తెలిపారు.