ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలు

ABN , First Publish Date - 2021-05-17T05:39:07+05:30 IST

ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద అవకతవకలు జరిగినా అధికారులు పట్టించుకోవడంలేదని బీజీపీ కిసాన్‌ మోర్చా జిల్లా అధ్యక్షుడు జనగామ మల్లారెడ్డి ఆరోపించారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలు

 పట్టించుకోని అధికారులు : బీజేపీ


చిన్నశంకరంపేట, మే 16: ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద అవకతవకలు జరిగినా అధికారులు పట్టించుకోవడంలేదని బీజీపీ కిసాన్‌ మోర్చా జిల్లా అధ్యక్షుడు జనగామ మల్లారెడ్డి ఆరోపించారు. ఆదివారం చిన్నశంకరంపేటలో ఆయన మాట్లాడారు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తే తూకం వేయడంలో దోచుకుంటున్నారని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో రైతులు అవస్థలు పడుతున్నారని మండిపడ్డారు. ఐకేపీ, పీఏసీఎస్‌ సెంటర్ల ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద గోనే సంచులు లేకపోవడంతో ధాన్యం తరలింపు నిలిపోతుందన్నారు. అకాల వర్షంతో వడ్లు తడిచి రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నీ ఇబ్బందులు ఉన్నా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యాన్ని వెంటవెంటనే ఖాళీ చేయించాలని కోరారు. సీఎం కేసీఆర్‌ రైతుల ఖాతాల్లో వెంటనే రైతుబంధు సాయాన్ని జమచేయాలని డిమాండ్‌ చేశారు. లేదంటే బీజేపీ పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఆయనవెంట వనం నర్సింహులు ఉన్నారు. 


Updated Date - 2021-05-17T05:39:07+05:30 IST